Dr.YSR.Polambadi subjects | డాII వై.ఎస్.ఆర్.పొలంబడి పాఠ్యాంశాలు | Polambadi Activities | raithubadi
డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి పాఠ్యాంశాలు
Polambadi Activities (పొలంబడి కార్యకలాపాలు)
పొలంబడి 14 వారాల కాలపు విలక్షణ కార్యక్రమం. మొదటి సమావేశం, మొలక వెదజల్లడం లేదా నాట్లు వేయడం తో మొదలై పంటకోతల వరకు కొనసాగుతుంది. నాట్లతో మొదలైతే సమావేశాలు వారానికి ఒకసారి నడపబడుతాయి, లేదా పరోక్ష విత్తడం చేసే ప్రాంతంలో వారంకంటే ముందే నిర్వహించబడుతాయి.
ప్రతీ సెషన్( సమావేశము) ఉదయం ప్రారంభమై మధ్యాహ్నభోజనానికి ముందు ముగించబడుతుంది. పొలంబడి యొక్క విలక్షణమైన కార్యక్రమము ఈ క్రింద ఇవ్వబడింది. పొలంబడి లో పాల్గొనే రైతులు ఆయా ప్రాంతాల ప్రత్యేక సమస్య దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని మార్చమని కోరవచ్చు.
పొలంబడి కి ముందు నిర్వహించే కార్యకలాపాలు
- పంట ఎంపిక.
- గ్రామ సమావేశ నిర్వహణ.
- ప్రారంభపు కార్యకలాపాలు 1) 9 చుక్కల ఆట 2) లక్షణాలు గుర్తింపు.
- రైతుల నమోదు.
- మూల్యంకన పూర్వ పరీక్ష ( బ్యాలెట్ బాక్స్ పద్దతి).
- ప్రాధమిక సర్వే ( ఆధార రేఖ సర్వేక్షణ) నిర్వహణ.
- లోపాలను గుర్తించుట మరియు వ్యూహాలను రచించుట.
- తగిన జోక్యాలను ఎంపిక చేయుట.
- మట్టినమూనాల సేకరణ.
- విత్తనాల మొలకెత్తింపు పరీక్ష.
- నీటి నిల్వ సామర్థ్యం పై సులభ ప్రయోగాలు.
పొలంబడి లో నిర్వహించే కార్యకలాపాలు
- పొలంబడి క్షేత్రాన్ని మార్పు చేయడం.
- వ్యవసాయ ఆవరణ వ్యవస్థ విశ్లేషణ.
- స్వల్ప మరియు దీర్ఘకాల ప్రయోగాలు.
- ప్రత్యేక పాఠ్యాంశాలు.
- బృంద విన్యాసాలు.
- మూల్యాంకనంతర పరీక్ష( బ్యాలెట్ బాక్స్ పద్దతి).
- ప్రకృతి వ్యవసాయ పద్దతులపై ఒక ప్రదర్శన క్షేత్రం.
పొలంబడి అనంతరం కార్యకలాపాలు
- క్షేత్ర దినోత్సవం.
- రైతులకు నైపుణ్యాన్ని పెంపొందించి, రైతును సదుపాయకర్తగా మార్చే శిక్షణా పాఠ్యాంశాలు.
Dr.YSR.Polambadi subjects
- సమగ్ర పంటల యాజమాన్య పద్దతులు (Integrated Crop Management)
- పొలం పరిసరాల విశ్లేషణ (Agro-Ecosystem analysis)
- భాగస్వామ్య సాంకేతిక కార్యాచరణ పరిశోధనలు (Participatory Technology Development)
- చీడ, పీడలు (Pests & Diseases)
- మిత్ర పురుగుల సంరక్షణ (Conservation of Defenders)
- మొక్కల పెరుగుదల దశలు, ధర్మాలు (Plant Physiology)
- ఆరోగ్యఅంశాలు (Health Issues)
- వృక్ష మరియు జీవ సంబంధమైన కీటక నాశీనులు (Botanical Pesticides & Biological Agents)
- వ్యక్తిత్వ వికాసము (Personality Development)
సమగ్ర పంటల యాజమాన్య పద్దతులు:
పొలం పరిసరాల విశ్లేషణ: వివిధ రకాల పంటలకు అనువైన భూమి, దానికి ఉండే నీటి వనరులు, అందులో ఉండే వివిధ రకాల మిత్ర, శత్రు పురుగులు మరియు ఆ పొలం చుట్టూ ఉన్న వాతావరణం ఇలాంటి అన్ని విశ్లేషించి పొలంబడి ద్వారా వివరించడం జరుగుతుంది.
వ్యక్తిత్వ వికాసము : రైతులలో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా కొత్త కొత్త విజ్ఞానాన్ని అందించి వారిలో ఆత్మవిశ్వాసం నింపి, వారి హక్కుల పట్ల, వారికి ఉండే ప్రభుత్వ వెసులుబాట్లు, సమాజంలో వారికి ఒక గుర్తింపు వంటివి వివరించడం జరుగుతుంది.
Post a Comment