వరి లో ఆకుముడత / నాము / తెల్ల తెగులు (నెఫాలోక్రోసిస్ మెడినాలిస్) మరియు తాటాకు తెగులు(హిస్పా)(డైక్లాడిస్పా ఆర్మీజేరా) | Leaf Folder in Paddy | Naamu | Rice Blast Disease | Tella Tegulu in Paddy | Raithubadi
వరి లో ఆకుముడత / నాము / తెల్ల తెగులు (నెఫాలోక్రోసిస్ మెడినాలిస్)
Leaf Folder in Paddy వరి నాటిన దగ్గర నుండి పొటాకు దశ వరకు ఖరీఫ్ మరియు రబీలో వస్తుంది. పొటాకు దశలో వస్తే నష్టం ఎక్కువ. లార్వాలు ఆకుల రెండు అంచులను కలిపి గొట్టంగా చేసి ఆకుపచ్చని పదార్థాన్ని గీకి తినటం వల్ల ఆకులు తెల్లబడి తర్వాత ఎండి పోతాయి.
Leaf Folder in Paddy ఈ పురుగు సీతాకోక చిలుకలు ముదురు గోధుమ రంగులో ఉండి రెక్కల అంచుల మధ్య సన్నని నల్ల గీతాలుంటాయి. ఆకులు నిలువుగా ముడుచుకొని తెల్లగా గీతాలుండటం, ఆకుముడతలు విడదీస్తే లార్వా దశలో
ఉన్న లేత పసుపు లేదా ఆకుమచ్చ పురుగులు కనబడటం లేదా పొలంలో నడుస్తూ ఉంటే గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులను బట్టి ఆకుముడతను గుర్తించవచవచ్చును.
ఆలస్యంగా నాటిన పొలాల్లో, వర్షాభావ పరిస్థితులలోను, పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడటం వలన ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. ముఖ్యంగా వెడల్పాటి ఆకు గలా రకాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. పొటాకు దశలో దుబ్బుకి 1 నుండి 2 కొత్తగా తెల్లగా గీకబడిన ఆకులు, వాటిలో చిన్న లార్వాలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. Leaf Folder in Paddy
పరాన్నజీవులైన ట్రైకోగ్రామా ఖిలోనెస్ ను ఎకరాకు 20,000 చొప్పున మూడు సార్లు వదిలి అరికట్టవచ్చును.
పిలక దశలో చేనుకు అడ్డంగా తాడును 2 - 3 సార్లు లాగితే పురుగులు క్రింద పడిపోతాయి.
క్లోరిపైరఫాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా.లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పొటాకు దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి. 2గ్రా.లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్.సి.0.4ml. లేదా ప్లూబెండిమైడ్ 20 డబ్ల్యు. డి.జి 0.25 గ్రా. లేదా ప్లూబెండిమైడ్ 48 ఎస్.సి. 0.1 ml లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి 8 కిలోల లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 శాతం 4 కిలోలు గుళికలు ఎకరాకు చొప్పున వేయాలి.
Leaf Folder in Paddy
తాటాకు తెగులు :
గుడ్డు దశ :
ఆడ బీటిల్ పెట్టిన రైస్ హిస్పా గుడ్లు సాధారణంగా ఆకుల దిగువ భాగంలో బాహ్యచర్మం క్రింద చేర్చబడతాయి. అప్పుడప్పుడు, గుడ్లు కూడా ఆకుల పైభాగంలో ఉంటాయి. గుడ్లు చీకటి పదార్ధంతో కప్పబడి, ఒంటరిగా ఉంచబడతాయి. ప్రతి ఆడ జీవి తమ జీవితకాలంలో మొత్తం 18 నుండి 101 గుడ్లు పెడతాయి, సగటు 55. పొదిగే కాలం సుమారు నాలుగు రోజులు.
తల్లి పురుగు:
పెద్ద పెంకు పురుగులు నీలంతో కూడిన నలుపు రంగులో మెరుస్తూ శరీరం పై ముళ్ళు కలిగి ఉంటాయి. పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల పైభాగాన్ని గీకి తినివేయడం వల్ల తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. పిల్ల పురుగులు (గ్రాబ్స్) లేత పసుపు రంగులో ఆకు పొరలలో దాగి ఉండి పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి.
ఈ పురుగుల ఉధృతిని నత్రజని ఎరువులు ఎక్కువగా వాడిన పొలాల్లో, తొలకరిలో ముందు మంచి వర్షాలు పది, ఆ తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొన్నా, పగటి-రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా తక్కువగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నా , పొలంలో నీడ ప్రదేశాలలో గమనించవచ్చు.
డబ్బుకు రెండు పెంకు పురుగులు లేదా రెండు పురుగులు ఆశించిన ఆకులు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి.
తాటాకు పురుగులు (ఆర్మిజెరా) వరి, మొక్కజొన్న మరియు ఇతర గడ్డి వంటి పంటలను లక్ష్యంగా చేసుకుని గణనీయం గా మొక్కల నష్టాన్ని కలిగిస్తుంది. పిలక మొక్కలు తెగుళ్ళ వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. పంటలు పండించిన ప్రాంతాల్లో తాటాకు పురుగుల (డి. ఆర్మిజెరా) ఉధృతిని తగ్గించి పంట దిగుబడిని పెంచడానికి రెండు ప్రాధమిక పద్ధతులు ఉపయోగించి జీవ నియంత్రణలు మరియు పురుగుమందులను ఉపయోగించి పొందవచ్చు.
నివారణకు:
ప్రొఫెనోఫాస్ 2మి. లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి. లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Post a Comment