Obstacles in paddy cultivation and production || వరి సాగు మరియు ఉత్పాదకతలో అవరోధాలు | Raithubadi
వరి సాగు మరియు ఉత్పాదకతలో అవరోధాలు
అనంతమైన జీవరాశికి నేలే ఆధారం. పంటలు పండటానికి నెల ముఖ్యమైన సహజవనరు. ఇది పైరుకు కావలసిన ఆధారమును ఇవ్వడమే కాకుండా, తేమను, అవసరమైన పోషకాలను అందిస్తుంది. నేల భౌతిక లక్షణాలతోబాటు, రసాయన లక్షణాలలో ఒకటి ఉదజని(పి.హెచ్. pH) వాల్యూ చాలా ముఖ్యమైనది.
భూమిలో లభ్యమైన హైడ్రోజన్ ఆయానుల గాఢత యొక్క ఋణ సంవర్గామానమునే (pH) ఉదజని సూచిక అంటారు. మొక్కలు ఆహార పదార్ధములను వాటి ఆయానుల రూపంలోనే గ్రహిస్తాయి. ఉదాహరణకు నత్రజని పోషకమును మొక్క నత్రజని పోషకము యొక్క ఆయాను నైట్రేట్ (NO3) రూపంలో గాని / అమ్మోనియం ఆయాను (NH4+ రూపంలో గాని గ్రహిస్తుంది. నేల నుండి మొక్కకు ఈ పోషకాలు లభ్యత నేల యొక్క pH విలువను బట్టి ఉంటుంది.
సాధారణంగా నేల pH విలువ 6.0 నుండి 7.0 మధ్య ఉన్నట్లయితే, భూమి సమతుల్య స్థితిలో ఉన్నట్లు చెప్పవచ్చు. అదే pH విలువ 6.0 కంటే తక్కువగా ఉంటే ఆ భూమి ఆమ్ల స్థితిలో ఉన్నట్లు. అదే pH విలువ 7.0 కంటే ఎక్కువ ఉంటే ఆ భూమి క్షార స్థితిలో ఉన్నట్లు నిర్ధారించవచ్చు. ఈ రెండు స్థితులలోను పోషక ఆయానుల ముక్కల వేరు వ్యవస్థ వద్ద స్థిరీకరించబడి, మొక్కకు లభించకుండా పోతాయి. ఈ స్థితి ఏర్పడటానికి గల కారణాలు.
- సేంద్రియ, పచ్చిరొట్ట ఎరువులను వాడకం తగ్గించి, రసాయన ఎరువులను సమతుల్యత లేకుండా, విచక్షణారహితంగా ప్రతిసారి ఒకే పంటను పండించడం.
- పంటల మార్పిడి విధానమును ఆచరించకుండా , ప్రతిసారి ఒకే పంటను పండించడం.
- సాగునీటి నాణ్యతను గమనిచకపోవడం, పరీక్ష చేయకుండా బోర్ల క్రింద, చెరువుల క్రింద, ఆయకట్టు ప్రాంతాలలో సాగుచేయడం.
- భూసార పరీక్ష ఆధారంగా రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు సమతుల్యంగా వాడకపోవడం.
Obstacles in paddy cultivation and production
- భూసార పరీక్షా ఫలితాలను అనుసరించి ఎరువులను వాడకపోవుట.
- నెలలో సేంద్రీయ కార్బనం తక్కువగా ఉండుట. పశువుల ఎరువు మరియు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పైర్లను విరివిగా వాడకపోవుట.
- సమగ్ర ఎరువుల యాజమాన్యం ఆచరించకపోవుట మరియు సూక్ష్మధాతు లోపాలను సకాలంలో సరిచేయకపోవుట, పైపాటుగా కాంప్లెక్సు ఎరువులను ఎక్కువగా వాడుట.
- సమగ్ర సస్యరక్షణా పద్దతులు పాటించకపోవుట, అవసరానికి మించి పురుగు మందులు వాడుట.
- ఆశించిన రీతిలో వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టకపోవడం.
- రాష్ట్రంలో వరి పంటకు ఉష్ణమండల వాతావరణం చాలా అనుకూలమైనది.
- వరి పండించటానికి 1000-1500 ml వర్షపాతం అవసరం.
- 25-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనుకూలం.
- వరి పంటలను అన్ని రకాల నెలల్లో పండించగలిగినప్పటికీ, ఒండ్రు నెలలు అనుకూలమైనవి.
- ఉదజని సూచిక 4-8 గల నెలల్లో వారి సాగును చేపట్టినప్పటికీ, ఉదజని సూచిక 6-7 గల నెలలు అనుకూలం.
- నాట్లు వేయడానికి, కలుపు మొక్కలను అదుపులో ఉంచుటకు, నీరు నిలిచేటట్లుగా నేలను 2-3 సార్లు బాగా దమ్ము చేయాలి.
- వివిధ ప్రాంతాలకు అనువైన వరి రకాలను ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాలి.
నేల pH విలువ ఉండవలసిన అవది లేకపోతే :
pH విలువ 6.0 కంటే తక్కువ గా ఉన్న నేలలను ఆమ్ల నేలలుగా నిర్ధారిస్తారు. ఆమ్ల లక్షణం గల నేలల వలన, మొక్కకు ఉపయోగపడే సూక్ష్మజీవులు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ స్థితిలో మొక్కకు నత్రజని, భాస్వరం, పొటాష్, మాలిబ్దనము తగినంతగా లాభము కావు. సూక్ష్మ పోషకాలైన జింకు, మాంగనీసు, రాగి మరియు ఇనుము ఎక్కువగా నీటిలో కరిగి, అధికముగా లభ్యమై మొక్కలకు హాని కలిగించే స్థాయికి చేరుతాయి.
కాల్షియం, మెగ్నీషియం, మాలిబ్దనము మొక్కకు అండకుండాపోయి మొక్కలు వేర్లు సరిగా వృద్ధి చెందవు. ఈ స్థితిలో pH విలువను 6.0 నుండి 7.0 మధ్య సరిచేయడానికి సున్నమును వాడుతారు. ఈ సున్నము ఎటువంటి రసాయనాలతో కలిపి వాడకూడదు.
ఆమ్లగుణం ను పెంపొందించే రసాయన ఎరువులైన కాల్షియం అమ్మోనియం నైట్రేట్, సల్ఫేట్ ఆఫ్ పోటాష్, మ్యూరేట్ ఆఫ్ పోటాష్ (MOP) లను వాడరాదు. ఆమ్లత్వంను తట్టుకొనే బంగాళదుంప, ఫైన్ ఆపిల్, కాఫీ వంటి పంటలను పెంచాలి.
Post a Comment