Header Ads

YSR Rythu bharosa full details in telugu | వైఎస్.ఆర్.రైతు భరోసా పూర్తి వివరాలు | Raithubadi

HTTPS://raithubadi.blogspot.com

గౌరవ నీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశలో రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ పథకాలుగా నవరత్నాలని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే, ఇందులో ఒక భాగమే" వై.ఎస్.ఆర్.రైతు భరోసా " అనే సంక్షేమ పథకాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టినారు. 
రైతు భరోసా కి సంబంధించి మొదట ఒక G.O.MS.No.96 ను అమలు చేశారు. దీని ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి, సంవత్సరానికి రూ.12,500/- విత్తన పెట్టుబడిగా ఇస్తున్నట్టు తెలియజేశారు. 

తరువాత మరల రెండవ  సారి కొద్ది పాటి సవరణలతో G.O.MS.No.113 ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13,500/- విత్తన పెట్టుబడిగా ఇస్తున్నట్టు తెలియజేశారు.
అయితే ఈ G.O లలో ఉన్న పూర్తి వివరాలు మీకు తెలుగులో తెలియజేస్తాము.

రైతుల సేవే లక్షంగా

రైతును ఊరు దాటించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు భరోసా కేంద్రాలకు ఉందని, ఆ మేరకు అవసరమయ్యే సేవలన్నింటినీ అందించాలని సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలు అన్నింటిని తీర్చడమే లక్షంగా RBK లు పనిచేయాలని, వీటి ద్వారా రైతులు ఆర్డర్ చేసిన వెంటనే నిర్ధేశిత సమయంలోగా విత్తనాలు, ఎరువులు, చేర్చాలని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామానికి RBK యూనిట్ గా పంటల ప్రణాళిక తయారు చేయాలన్నారు. RBK లలో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. 

గ్రామ స్థాయిలో విత్తన ఉత్పత్తి :

వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో విత్తనం ఒక కీలకమైన వనరు. ఇతర వనరుల  పనితీరు, సామర్థ్యం విత్తనాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడి సాధించడంలో దృవీకృత / నాణ్యమైన విత్తనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పంట ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చాలా ముఖ్యమైన విషయము.

ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ముందుగా పరీక్షించిన నాణ్యమైన విత్తనం రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసే ఉద్దేశముతో గ్రామ స్థాయిలో రైతుల ద్వారా వేరుశనగ విత్తన ఉత్పత్తికి 2020 - 2021 లో ప్రణాళిక చేయబడినది. 

1. రైతుభరోసా పథకం యొక్క లక్ష్యం:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2019 అక్టోబర్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మరియు కౌలు రైతుల ఆర్థిక సహాయం కోసం "YSR RYTHU BHAROSA" అనే సంక్షేమ పథకాన్ని అమలపరచి, ప్రతీ రైతు కుటుంబానికి సంవత్సరానికి Rs.13,500 /- వారి పంట సీజన్ లలో విత్తన పెట్టుబడిగా అందిస్తూ, పంట అధిక దిగుబడి తో రైతుకు అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం.

2. రైతుభరోసా పథకం యొక్క ప్రయోజనాలు:

సాగు భూమిని కలిగివున్న ప్రతీ రైతు కుటుంబానికి భూ పరిమాణం తో సంబంధిం లేకుండా రూ.13,500/- ప్రయోజనాన్ని అందిస్తుండగా , ఇందులో రూ.6000/- లను PM-KISAN సెంట్రల్ గవర్నమెంట్ పథకం నుండి 3 విడతలుగా అర్హత గల రైతులకు ఇవ్వనున్నారు.

3 instalment వివరాలు :
మొదటి విడత @Rs.7500/- మే నెలలో ఇవ్వగా అందులో PM-KISAN నుండి Rs.2000/- కలిపి ఉన్నవి.
రెండో విడత @Rs.4000/- అక్టోబర్ నెలలో (PM-KISAN నుండి Rs.2000/- కలిపి ఉంటాయి.
మూడో విడత @Rs.2000/- జనవరి నెలలో (only PM-KISAN నుండి మాత్రమే ఇస్తారు.)

ఈ పథకం సొంత భూమి లేని రైతులకు, SC, ST, BC మరియు మైనారిటీ వర్గాలకు కూడా వర్తింపజేస్తూ, సంవత్సరానికి @Rs.13,500/- లను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ నుండి ఇవ్వనున్నారు.

అలాగే భూమి లేని కౌలు రైతులతో పాటు ROFR సాగు దారులకు కూడా ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మొత్తం Rs.13,500/- మూడు విడతలుగా ఈ క్రింద విధంగా ఇవ్వడం జరుగుతుంది.
1st Instalment @Rs.7500/- during the month of May.
2nd Instalment @Rs.4000/- during the month of October.
3rd Instalment@ Rs.2000/- during the month of January.

మిగతా వివరాలు రాబోయే పోస్ట్ లలో చూడండి.

మీ యొక్క రైతుభరోసా status check చేసుకోండి ఈ క్రింది లింక్ లో 

https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase2Paymentstatus


YSR RYTHU BHAROSA payment status Click Here

No comments