Header Ads

Establishment of Agricultural Machinery (CHC) Duty Policies by Farmer Assurance Centers (RBK) | రైతు భరోసా కేంద్రాలు(RBK) ద్వారా వ్యవసాయ యంత్రపరికరాల ఏర్పాటు(CHC) విధి విధానాలు | raithubadi

Establishment of Agricultural Machinery (CHC) Duty Policies by Farmer Assurance Centers (RBK)

https://raithubadi.blogspot.com

Establishment of Agricultural Machinery

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన పద్దతిగా ప్రతి గ్రామములో రైతు భరోసా కేంద్రము(RBK) లో వ్యవసాయ ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ప్రణాళిక సిద్ధపరిచింది.

జిల్లాలోని రైతు భరోసా కేంద్రము(RBK)ల పరిధిలోని గ్రామములో సాగు చేయుచున్న పంటలకు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను 5-6 మంది రైతులతో ఏర్పాటైన గ్రూపులకు అందించి వారి ద్వారా గ్రామములోని ఇతర రైతులకు యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే విధానాన్ని (CHC) కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఈ సంవత్సరం నుండి ఏర్పాటు చేయుచున్నది.

  1. రైతు RBK(రైతు భరోసా కేంద్రము)లో నివసిస్తూ, పొలము వారి పేరిట ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులు 5-6 మంది ఒక గ్రూపు గా ఏర్పడి RBK స్థాయిలో రిజిస్టర్ చేయించుకోవాలి.
  2. మండల స్థాయి కమిటీ (వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, DCCB బ్యాంక్ మేనేజరు) ద్వారా అర్హులైన గ్రూపులు DCCB బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవలెను.
  3. రైతుకు కావలసిన యంత్ర పరికరములు వారికి నచ్చిన కంపెనీల ద్వారా కొనుగోలు చేయవచ్చును.
  4. ఒక గ్రూపుకు రూ.12-15 లక్షల రూపాయలు విలువ గల యంత్రములు కొనుగోలు చేయవచ్చు. మొత్తము విలువలో 40% ప్రభుత్వము నుండి రాయితీ, 50% DCCB బ్యాంక్ ద్వారా ఋణము పొంది 10% రైతులు కట్టవలసి ఉండును. బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించిన రైతులనే గ్రూపు సభ్యులుగా చేర్చుకొనవలెను. Establishment of Agricultural Machinery
  5. యంత్ర పరికరాల ధరల నిర్ణయములో పూర్తి పారదర్శకత ఉండేలా వాటి ధరలను Online తో పాటు రైతు భరోసా కేంద్రం(RBK) లోని కియోస్కీలలో ఉంచబడును.
  6. గ్రూపులు తమకు అవసరమైన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకొనుటకు ఉత్పత్తి దారులతో రెవెన్యూ స్థాయిలో ప్రదర్శనలను ఏర్పాటుచేయబడును.
  7. ఆసక్తి కలిగిన రైతులు ఆగస్ట్ నెల 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవలెను.
  8. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘము వారు కూడా ఈ పధకమునకు అర్హులు ఏ గ్రామములో ఆఫీసు ఉండునో ఆ గ్రామములో మాత్రమే కస్టమ్ హైరింగ్ సెంటర్(CHC) ఏర్పాటు చేయవచ్చును.
  9. వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు ఋణ సౌకర్యము కల్పించే విధానములో వ్యవసాయ శాఖ, ఆస్కాబ్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. గుర్తించిన సంఘాలకు సెప్టెంబర్ 15 నాటికి DCCB బ్యాంక్ ఋణములు మంజూరు చేయవలెనని ఆ రుణాన్ని 3 నుండి 4 సంవత్సరాల లో రైతు సంఘాలు తేర్చాల్సి ఉంటుంది.
  10. కస్టమ్ హైరింగ్ సెంటర్(CHC) లోని యంత్ర పరికారముల అద్దె వివరాలు రైతు భరోసా కేంద్రము(RBK) లో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రదర్శించవలెను. Establishment of Agricultural Machinery

  ఆధునిక యంత్ర పరికరాలు అయిన హానికర క్రిమికీటకాలకు వాడే మందులను పిచికారి చేయుటకు మరియు కూలీల కొరత, సమయం ఆదా మొదలగు అవసరాల దృష్ట్యా రైతులకోసం రూపొందించబడిన ద్రోణులు (Drone) అంటే గాలిలో ఎగిరే చిన్న హెలికాప్టర్ అన్నమాట. ఇంకా పవర్ స్పయేర్లు , హార్వెస్టింగ్ యంత్రాలు, ట్రాక్టర్లు, కల్టీవేటర్లు, మొదలగిన యంత్రాలు కోనుగోలు చేయవచ్చు.

CHC(కస్టమ్ హైరింగ్ సెంటర్):
భారతీయ వ్యవసాయం మానవ శక్తిపై ఆధారపడటం నుండి క్రమంగా మార్పు చెందుతోంది, జంతు శక్తి నుంచి యాంత్రిక శక్తికి ఎందుకంటే జంతువుల నిర్వహణ కోసం పెరుగుతున్న వ్యయం మరియు మానవ శ్రమ పెరుగుతున్న కొరత. 

ఇంకా, యాంత్రిక శక్తి యొక్క ఉపయోగం ప్రత్యక్ష బేరింగ్ కలిగి ఉంటుంది పంటల ఉత్పాదకతపై కాకుండా, దుర్వినియోగాన్ని తగ్గించడం మరియు సమయస్ఫూర్తిని సులభతరం చేయడం.

 అందువల్ల వ్యవసాయ యాంత్రీకరణ  అవసరం ఉంది. ఏదేమైనా, వ్యవసాయ విద్యుత్ పంపిణీ రాష్ట్రాలలో చాలా అసమానంగా ఉంది, దీనిలో యాంత్రిక శక్తి యొక్క అత్యధిక ఉపయోగం పంజాబ్లో హెక్టారుకు 3.5 కిలోవాట్ల మరియు అంతకంటే తక్కువ బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు 1 కిలోవాట్లు. యాంత్రిక శక్తి ఎక్కువగా వినియోగించబడుతుంది పెద్ద భూములలో మరియు చిన్న / ఉపాంత హోల్డింగ్లకు ఇప్పటికీ అందుబాటులో లేదు మొత్తం భూములలో 80% ఉంటుంది. 

దీనికి కారణం చిన్న / ఉపాంత రైతులు, వారి ఆర్థిక స్థితిగతుల వల్ల వ్యవసాయాన్ని సొంతం చేసుకోలేరు యంత్రాలు సొంతంగా లేదా సంస్థాగత క్రెడిట్ ద్వారా. అందువల్ల పొలం తీసుకురావడానికి చిన్న / ఉపాంత హోల్డింగ్స్, సామూహిక యాజమాన్యం లేదా అందుబాటులో ఉన్న యంత్రాలు కస్టమ్ నియామక కేంద్రాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ మోడల్ పథకం సిద్ధంగా ఉంది కస్టమ్ నియామక కేంద్రాల స్థాపనకు ఫైనాన్సింగ్ అని బ్యాంకులను ప్రదర్శించండి a ఆర్థికంగా లాభదాయకమైన యూనిట్.


AP వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం 2021-22 వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా


No comments