Sesame Cultivation in Andhra Pradesh | నువ్వుల సాగుకు అనువైన భూములు విత్తన రకాలు విత్తన శుద్ధి సమగ్ర వివరణ | Raithubadi
Sesame Cultivation |
Sesame Cultivation in Andhra Pradesh
మన రాష్ట్ర౦లో నువ్వు పంట షుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 50 వేల టన్నుల దిగుబడినిస్తున్నది. నువుల్లోనూనె శాతం 46-55, ప్రొటిను 20-25 శాతం ఉండడమే కాకుండా విటమిస్థు, అమైనో అమ్లాలను మరియు పాలీఅన్ సాచురేటెడ్ ఫాటీ అమ్లాలు కూడా సమృద్దిగా ఉంటాయి.
Sesame Cultivation in Andhra Pradesh
ఖరీఫ్ పంటలు అలస్యంగా వేసిన పరిస్ధితులలో రెండవ పంటగా జనవరి , ఫిబ్రవరి మూసాల్లో విత్తుకొని, అతి తక్కువ సమయంలో, తక్కువ వనరూల తో నికర లాభాన్ని ఆర్దించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్ మరియు రబీలో వర్జాధారంగా పండించిన దాని కంటే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినపుడు చీడ పీడల బెడద తక్కువగా ఉండి, విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రంలో నువ్వు పంట ను ముఖ్యముగా ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా పండిస్తారు.
నువ్వులు - నేలలు
మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టము. నీరు నిలిచే ఆమ్ల , క్షార గుణాలు కల నేలలు పనికిరావు.
నేలతయారి
నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, 2సార్లు పంటకు తోలి. చదును చేయాలి.
నువ్వులు విత్తన౦
విత్తే పద్ధతి
ఎకరాకు 2.4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
విత్తన శుద్ధి
కిలో విత్తనానికి ౩ గ్రాముల థైర౦/కాప్టాస్/మాంకోజెబ్ తో విత్తన శుద్ధి చేసి విత్తటం మంచిది.
విత్తే దూరం
వరుసల మధ్య ౩౦సెం.మీ.(12 అంగుళాలు) మరియు మొక్కల మధ్య 15సెం.మీ.(6 అంగుళాలు)
విత్తే సమయం:
ఎర్లీ ఖరీఫ్
కృష్ణా-గోదావరి డెల్లా మరియు ఉత్తర కోస్తా ప్రా౦తాలలో మే 15 - మే 31 వరకు, రాయలసీమ లో మే-జూన్, ఉత్తర తెలంగాణాలో మే-జూన్ , దక్షిణ తెలంగాణాలో మే-జూన్ వరకు విత్తుకోవచ్చు.
లేట్ ఖరీఫ్
ఉత్తర తెలంగాణాలో జూలై ఆఖరి పక్షం నుండి ఆగష్టు మొదటి పక్షంలో , దక్షీణ తెలంగాణాలో ఆగష్టు రెండవ పక్షంలో విత్తుకోవచ్చు.
రబీ లేదా వేసవి
కృష్ణా-గోదావరి డెల్లా మరియు ఉత్తర కోస్తా ప్రా౦తాలలో డిసె౦బరు 15-జనవరి 15 వరకు, రాయలసీమ లో జనవరి 2,3 వారాలు, ఉత్తర తెలంగాణాలో జనవరి రెండో పక్షం నుండి ఫబ్రవరి మొదటి పక్షం వరకు, దక్షిణ తెలంగాణాలో జనవరి రెండో పక్షంలో విత్తుకోవాలి.
నువ్వులు రకాలు
గౌరి
ఎర్లీ ఖరీఫ్. పంటకాలం 90 రోజులు. దిగుబడి ఎకరాకు 250 కిలోలు. నూనె శాతం 500 ముదురు గోధుమ రంగు విత్తనం.
కోస్తా జిల్లాలకు అనువైనది.
కోడు ఈగకు కొంతవరకు తట్టుకుంటుంది.
మాధవి
ఎర్లీ ఖరీఫ్. పంటకాలం 70-75 రోజులు .దిగుబడి ఎకరాకు 200 కిలోలు.
నూనె శాతం 50-51 లేత గుధుమ రంగు విత్తనం పలు పంటల పద్ధతికి అనుకూలం.
యెలమంచి-11
- ఎర్లీ ఖరీఫ్. పంటకాలం 80-85 రోజులు .దిగుబడి ఎకరాకు 360-400 కిలోలు.
- నూనె శాతం 52.50 ముదురు గోధుమ రంగు విత్తనం.
- కోస్తా జిల్లాలకు అనువైనది .
- పంట ఒకే సారి కోతకు వస్తు౦ది.
యెలమంచి-17
- ఎర్లీ ఖరీఫ్. పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340 కిలోలు.
- నూనె శాతం 520 లేత గోధుమ రంగు విత్తనం.
- కోస్తా జిల్లాలకు అనువైనది .
- బూడిద తెగులును తట్టుకుంటుంది.
రాజేశ్వరి
- లేట్ ఖరీఫ్లో పంటకాలం 90 రోజులు. దిగుబడి ఎకరాకు 200 కిలోలు
- రబీ /వేసవి లో పంటకాలం 80 రోజులు. దిగుబడి ఎకరాకు 300 కిలోలు.
- నూనె శాత౦ 500 తెల్ల గింజ రకం.
- తెలంగాణా కోస్తా జిల్లాలకు అనుకూలం.
- కాండం కుళ్ళు, బూడిద తెగులును తట్టుకుంటుంది.
స్వేతాతిల్
- లేట్ ఖరీఫ్ లో పంటకాలం 85-90 రోజులు. దిగుబడి ఎకరాకు 250 కిలోలు.
- రబీ /వేసవి లో పంటకాలం 80 రోజులు. దిగుబడి ఎకరాకు 450 కిలోలు.
- నూనె శాతం 51-520 తెల్ల గింజ రకం. తెలంగాణా ప్రాంతానికి అనుకూలం.
- వేసవి లో రాష్ట్రమ౦తటికి అనుకూలం. కాండం కుళ్ళు తెగులును తట్టుకుంటుంది.
- ఎగుమతికి ప్రాధాధాన్యత కలదు.
చందన
- ఖరీఫ్ లో పంటకాలం 85 రోజులు. దిగుబడి ఎకరాకు 250 కిలోలు.
- రబీ /వేసవి లో పంటకాలం 80 రోజులు. దిగుబడి ఎకరాకు 480 కిలోలు.
- నూనె శాతల 50-510 గోధుమ రంగు విత్తనం అన్ని కాలాలకు అనుకూలల.
- వెర్రితల తెగులును తట్టుకుంటుంది.
హిమ(జె.సి.యన్-9426)
- ఖరీఫ్ లో పంటకాలం 80 రోజులు. దిగుబడి ఎకరాకు 250 కిలోలు.
- రబి /వేసవి లో పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 480 కిలోలు.
- నూనె శాతం 510 స్వల్పకాలిక తెల్ల గింజ రకము, కాయలు పొడవుగా ఉంటాయి.
- ఎగుమతికి ప్రాధాన్యత కలదు.
- వెర్రి తెగులును తట్టుకుంటుంది.
Post a Comment