Black Gram Cultivation in Andhra Pradesh-raithubadi | మినుము పంట సాగు మరియు వివిధ విత్తన రకాలు పూర్తి వివరాలు | raithubadi
మినుము పంట:
మినుము పంట సాగుకు అనువైన నెలలు :
మినుము సాగుకు నేలను సిద్ధం చేయుట:
విత్తే సమయాలు:
- తొలకరిలో జూన్ 15 నుండి జులై 15 లోపు
- రబీ లో మెట్ట భూముల్లో అక్టోబరు నుండి నవంబర్ 15 లోపు
- రబీ లో మాగాణి లో నవంబర్ నెలలో
- వేసవిలో మరియు వేసవి అరుతడిలో ఫిబ్రవరి 15 నుండి
- వేసవిలో మాగాణి లో march నెల 15 వరకు విత్తుకోవచ్చు.
- రబీ లో వరి భూముల లో నవంబర్ 15 నుండి డిసెంబర్ మొదటి వారం లోపు విత్తుకోవాలి.
గమనిక : జూలై 15 తర్వాత విత్తితే కలుపు బెడద, చీడ,పీడలు ఎక్కువగా ఉండి అధికంగా దిగుబడి తగ్గిపోతుంది.
విత్తన రకాలు :
రబీకాలంలో మినుమును వరి మాగాణుల్లో పండించడం మన రాష్ట్ర ప్రత్యేకత. వరి కోయడానికి 2-౩ రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిని విత్తనం మొలిచి భూమిలోని మిగిలిన తేమని, సారాన్ని ఉపయోగించుకొని పెరిగి పంటకొస్తుంది.
ఈ పద్ధతిలో భూమిని తయారు చేయడం, అంతరకృషి, ఎరువుల వాడకం లాంటివి వీలుకాదు. కాబట్టి మాగాణి అపరాల సాగులో కలుపు సమస్య ఆధికం.
వరి మగాణులకు ఎంపిక చేనుకునే రకాలుత్వరగాపెరిగిప్రక్కలకు వ్యాపించి ఖాళిలు పూరించ గలగాలి.ఏపుగాదట్టింగా పెరిగి. కలుపు మొక్కలను అణచివేయగలగాలి. బూడిద మరియు ఎండు తెగుళ్ళును తట్టుకోన గలగాలి. బెట్టకు గురికాక ముందే కోతకు రావాలి.
ఖరిఫ్ కు అనువైన రకాలు
ఎల్.బి.జి-20(తేజ):
పంట కాలం 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 5-7 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం, కాయపైన నూగువుండదు. పల్లాకు తెగులును తట్టుకొంటుంది.
టి.9:
పంట కాలం 70-75రోజులు. దిగుబడి ఎకరాకు 4-5 క్వి౦టాళ్ళు. కాయమీద నూగు వుండదు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
ఎల్.బి.జి.-623(లాం 623):
పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వి౦టాళ్ళు, పాలిఫ్ రకం. గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.
డబ్ల్యు .బి.జి.-26(వరంగల్-26):
పంట కాలం70-75 రోజులు. దిగుబడి ఎకరానుకు 4-5 క్వి౦టాళ్ళు, సాదారకం, కాయల మిద నూగు వుండదు. కాపు అడుగు భాగాన కేంద్రీకృతమై ఆకులు కప్పబడి ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
పి.బి.జి.-1:
పంట కాలం 70-75రోజులు. దిగుబడి ఎకరాకు 4-5 క్వి౦టాళ్ళు, సాదారకం ,కాయపైన నూగుఉంటుంది.
వరి మాగాణులకు అనువైన రకాలు
ఎల్.బి.జి.-402(ప్రభవ):
పంట కాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. ఎత్తుగా పెరిగి కలుపును అణచి వేస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది.
ఎల్.బి.జి.-611:
పంట కాలం 90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వి౦టాళ్ళు. నిటారుగా పెరిగే సాదారకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయ మీది నూగు హెచ్చు.
ఎల్.బి.జి.-22:
పంట కాలం 85 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వి౦టాళ్ళు. సాదా రకం. మొక్క పైన, కాయపైననూగుఎక్కవ, ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.
ఎల్.బి.జి.-648:
పంట కాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది . పైరు తీగ వేస్తూ విస్తరంచి పెరుగుతుంది. కాయల పై నూగు కలిగి ఉంటుంది. బూడిద, ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది.
ఎల్.బి.జి.-685:
పంట కాలం 85-90 రోజులు. దిగిబడి ఎకరానుకు 8-9 క్వి౦టాళ్ళు. పోలిష్ రకం, ఎండు తెగుకును తట్టుకుంటుంది. కాయల పై నూగు తక్కువగా వుంటుంది. కాయల కణుపుల వద్ద కూడా కాస్తుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.
ఎల్.బి.జి-645:
పంటకాలం 85-90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-12 క్వి౦టాళ్ళు. లావు పాటి పాలిష్ రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయల పై నూగు తక్కువగా ఉంటుంది. కాయలు పోడవు, నూగు ఉండదు.
పి.బి.జి.-107:
పంట కాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 7-8 క్వి౦టాళ్ళు. సాదా రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయల పై నూగు ఉంటుంది.ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.
ఎల్.బి.జి-709:
పంట కాలం 80- 85 రోజులు. దిగుబడి ఎకరానుకు 6-7 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం .కాయల పై నూగా ఉంటుంది, మాగాణి భూములలో ఆలస్యంగా డిసంబర్ చివర వరకు విత్తుటకు అనువైనది.
విత్తన మోతాదు :
- తొలకరిలో ఎకరానికి 6,5,8 కిలోలు
- రబీ మెట్ట భూముల లో ఎకరానికి 6,5,8 కిలోలు
- రబీ మాగాణిలో ఎకరానికి 16 కిలోలు
- వేసవి ఆరుతడిలో ఎకరానికి 10 - 12 కిలోలు
- వేసవి మాగాణిలో ఎకరానికి 16 - 18 కిలోలు విత్తనాలు విత్తుకోవచ్చు.
విత్తనశుద్ది :
ఒక కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్పాన్ మరియ 2.5 గ్రాముల థైరామ్ లేదా కాకాప్తాన్స్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి.
ఒక ప్లాస్టిక్ కవర్ లో విత్తనాలు ఉంచి, అందులో ద్రవ రూపంలో ఉన్న పైన చెప్పిన మందులను విత్తనాలపై పోసి బాగా కలియబెట్టాలి. ఈ పని చేసే సమయంలో చేతులకు తొడుగులు, ముక్కుకు మాస్కు దరించుకోవాలి. మరిన్ని వివరాలకు క్రింది వీడియో చూడండి.
విత్తే దూరం:
తొలకరిలో, మెట్ట లో గొర్రుతో సాలల మధ్య విత్తుకోవాలి. విత్తే వరుసల మధ్య 30 cm, ఒకే వరుసలో మొక్కల మధ్య 30 cm దూరంలో విత్తుకోవడం వల్ల చ.మీ. కు 33 మొక్కలు ఉంటాయి.
నీటి యాజమాన్యం:
వర్షాభావ పరిస్ధితి ఏర్వడినప్పుడు ఒకటి రెండు నీటి తడులు ఇవ్వవలసివస్తుంది.వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు. ఒకటి రెండు తేలిక తడులు, ౩౦ రోజులు లోపు మరియు 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
ఎరువులు:
మొదటగా మీ పొలములో ని కొంత మట్టిని తీసి భూసార పరీక్షలు చేయడానికి పంపాలి. తరువాత మీ నెలలో ఏమి లోపం ఉందో చూసుకొని ఎరువులు వాడుకోవాలి. భూసార పరీక్షలో పొటాషియం తక్కువగా ఉంటే, హెక్టారుకు 20కిలోల పొటాషియం ను ఇవ్వగల యూరిట్ ఆఫ్ పోటాష్ ను దుక్కిలో బాగా కలియ దున్నాలి. నత్రజనిని యూరియా రూపంలో ను, భాస్వరం ను సూపర్ పాస్పెట్ రూపంలో ను వేసుకోవాలి.
భూమిని బాగా దుక్కి దున్ని విత్తటానికి ముందు హెక్లారుకు 20 కిలో ల నత్రజని ,50 కిలోల భాస్యరం నిచ్చే ఎరుపులను వేసి గోఱ్ఱుతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము పాగు చేసేతప్పుడు ఎరువులు వాడనవసరం లేదు.
Post a Comment