వరి పంటలో కలుపు మొక్కల నివారణకు వాడదగిన మందులు | Drugs that can be used to control weeds in rice crop | raithubadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాములో వరి పంట సుమారు 6 నుండి 8 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 45 నుండి 50 లక్ష టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయబడుతుంది. వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలలో కలుపు(weeds) మొక్కలు ఒకటి.
కలుపు(weeds) మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చీడ పీడల మాదిరిగా పైకి కనిపించదు. కానీ నెమ్మదిగా పోషకాలు, నీరు, సూర్యరశ్మి కొరకు ప్రధాన పంటలతో పోటీ పడి తీవ్రమైన నష్టం కలుగ చేస్తాయి.
కలుపు (weeds) మొక్కల వల్ల సాంప్రదాయ వరిలో 34 శాతం, మెట్ట వరిలో 67 శాతం, నేరుగా విత్తే పద్దతిలో 75 శాతం వరకు దిగుబడి తగ్గి నష్టం జరుగుతుంది అని అంచనా.
సాధారణంగా వరి పంటలో గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు అనే మూడు రకాల కలుపు(weeds)మొక్కలు ఎక్కువగా వస్తాయి. వీటిలో ప్రధానమైనవి గరిక, ఊద, ఒడిపిలి, తుంగ, గుంటగలగరాకు, అంతర తామర, పిల్లిడుగు ముఖ్యమైనవి.
ప్రస్తుతం కూలీల సమస్య ఎక్కువగా ఉండటంతో రైతు సోదరులు కలుపు (weeds) నివారణకు రసాయన మందులపై ఆధార పడుతున్నారు. కానీ వాటిని వాడ వలసిన సమయంలో, వాడవలసిన మోతాదులో వాడకపోవడం వల్ల కలుపు (weeds) నివారణ సరిగా జరగకపోగా, సాగు ఖర్చు పెరిగిపోవడం, పంటకు నష్టం కలగడం జరుగుతుంది. కావున రైతు సోదరులు కలుపు నివారణ పై అవగాహన ఏర్పరుచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
నారుమడి లో కలుపు నివారణ :
నారుమడి లో ఊద నిర్మూలన కు బొలెరో లేదా సాట్రాన్ ను 1.5 నుండి 2.0 లీటర్లు , 200 లీ నీటిలో కలిపి ఎకరా నారుమడిలో విత్తిన 7 వ లేదా 8 వ రోజు పిచికారి చేయాలి . దీని రసాయన నామం బెంథియోకర్బ్ 50% ఇ.సి . అలాగే దీనికి బదులుగా మాచేట్, టీర్, ట్రాప్, మిల్ క్లోర్, ధను క్లోర్, అను క్లోర్ (రసాయన నామం బ్యుటా క్లోర్ 50% ఇ. సి. ) వంటి మందులను వాడవచ్చు. లేదా విత్తిన 14, 15 రోజులకు సైహలో ఫాస్ పి బుటైల్ 10% 400 మి. లీ. 200లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
నాట్లు వేసిన పొలంలో కలుపు (weeds) మొక్కల నివారణ:
నాట్లు వేసిన 3 నుండి 5 రోజుల లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి 25 కిలోల పొడి ఇసుకలో 1.0 - 1.5లీ. బ్యుటా క్లోర్ 500మి. లీ. అనిలోఫాస్ లేదా ప్రిటిలా క్లోర్ లేదా 1.5 - 2.0 లీ. బెంథియోకర్బ్ కలిపి ఎకరం పొలంలో సమానంగా వెదజిల్లాలి. లేకుంటే నాట్లు వేసిన 3 నుండి 5 రోజుల లోపు ముందుగా 500 మీ.లీ. నీటిలో 35-50 గ్రా. ఆక్సాడయార్జిల్ కలిపి , ఆ తర్వాత దానిని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో సమానంగా పడేలా వెదజల్లవచ్చు.
గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకులు ఉన్న మొక్కలు ఉంటే నాటిన 3 నుండి 5 రోజుల లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి 20 కిలోల ఇసుకలో 4 కిలోల లొండాక్స్ పవర్ టి (బెన్ సల్ఫయురాన్ మిథైల్ + ప్రెటిలా క్లోర్) గుళికలు ఎకరం పొలంలో సమానంగా పడేలా వెదజల్లవచ్చు.
నాట్లు వేసిన 15 నుండి 20 రోజులకు వాడదగిన కలుపు(weeds) మందులు:
గడ్డి జాతి కలుపు నివారణకు : ఒక ఎకరాకు సైహలో ఫాప్ పి బుటైల్ 250 నుండి 300 మి. లీ. లేదా ఫినాక్షీప్రాప్ పి ఇథైల్ 200 నుండి 250 మి. లీ. ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
గడ్డి జాతి, తుంగ జాతి మరియు వెడల్పాకు కలుపు(weeds) నివారణకు:
బిస్ పైరి బాక్ సోడియం (నామిని గోల్డ్) 100మి. లీ. లేక మెట్ సల్ఫయురాన్ మిథైల్ + క్లోరిమ్యురాన్ ఇథైల్ (ఆల్ మి క్స్) 8 గ్రా. ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
నామిని గోల్డ్ 100ml -Rs.770 |
నాట్లు వేసిన 25 - 30 రోజుల మధ్య వాడదగిన కలుపు (weeds) మందులు:
ఈ దశలో అంతర తామర, పిల్లిడుగు, గుఱ్ఱపుడెక్క వంటి వెడల్పాకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు ఒక ఎకరాకు 500గ్రా 2,4 డి సోడియం సాల్ట్ లేదా 400గ్రా. 2,4 డి అమైన్ సాల్ట్ మందుల్లో ఏదో ఒక దానిని పిచికారీ చెయ్యాలి. పై పాటుగా వేసే కలుపు మందులను ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు లేతగా అంటే 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు కలుపు మొక్కల పై పడే విధంగా పిచికారి చేయాలి.
కలుపు (weeds) మందులు పిచికారి చేసేటప్పుడు చేతి పంపును మాత్రమే ఉపయోగించాలి. గాలి వాటం ఎక్కువ గా ఉన్నప్పుడు పిచికారి చేయకూడదు.
వరి లో వాడే కలుపు మందులు మరియు వాటి వ్యాపార నామాలు:
Post a Comment