Header Ads

ఏ రకం వరి ఎటువంటి తెగుళ్ళు తట్టుకుంటాయి, ఎంత దిగుబడి వస్తుంది పూర్తి వివరణ || Raithu Badi || Full description of what type of rice is resistant to any pests and how much it yields

1. స్వర్ణ (యం. టి.యు 7029 - MTU 7029) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days): 150

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) : 3.0

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  3.0

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  ఎండాకు తెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  వివిధ రకాల భూముల్లోనూ, వాతావరణ పరిస్థితులలోను, రెండు పంటలు పండించవచ్చు. స్థిరమైన దిగుబడి ని ఇస్తుంది. తక్కువ నత్రజని తో అధిక దిగుబడినిస్తుంది.

2. కృష్ణవేణి  (యం. టి.యు 2077 - Krishnaveni - MTU 2077) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days): 150

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :  2.5

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  4.0

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : సుడిదోమ

ఇతర గుణగణాలు ( Other Attributes ) : సన్నబియ్యం. గింజ చెనుమీద రాలే స్వభావం ఉంది కనుక కర్ర పచ్చిగా కోయటం మంచిది. చేను నేలపై పడదు, ఎండాకు తెగులు తట్టుకోలేదు.

3. మారుటేరు సాంబ (యం. టి.యు 1224 - MTU 1224) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days): 135

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) : 2.5

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  2.0

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : దోమ పోటును తట్టుకోగలదు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :

చేను మీద పడిపోదు, సన్నబియ్యం, అన్నం బాగుంటుంది.

4. ఇంద్ర (యం. టి.యు 1061 - MTU 1061) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days):  150

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) : 3.0

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  2-3

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : సుడిదోమ 

ఇతర గుణగణాలు ( Other Attributes ) : తెల్లని సన్నబియ్యం, చేను మీద పడిపోదు. 10 రోజుల వరకు ముంపును, కొద్దిపాటి చౌడును తట్టుకోగలదు. అన్నానికి బాగుంటుంది.

5. బాడవ మషూరి (పి. ఎల్.ఎ 1100 - PLA 1100) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days): 160

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) : 2.5

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : ---

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  ---

ఇతర గుణగణాలు ( Other Attributes ) : నీరు నిల్వవుండు పల్లపు ప్రాంతాలకు అనువైన రకం. గింజలు సన్నగా మసూరీ రకాన్ని పోలి ఉంటాయి. గింజ సులువుగా రాలే స్వభావం ఉంది. కోత సమయంలో వర్షం వస్తే గింజ మొలకెత్తుతుంది. పచ్చి బియ్యానికి అనుకూలం. 

6. విజేత (యం. టి.యు 1001 - MTU 1001) :

ఋతువు (Season) :  ఖరీఫ్ , రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days): 135, 125

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :  2.5, 3.2

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  6.0

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : సుడిదోమ, అగ్గితెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) : చేను పై పడిపోదు, జింకు ధాతువు లోపాన్ని తట్టుకోలేదు.

7. కాటాన్ దొర సన్నాలు (యం. టి.యు 1010 - MTU 1010) :

ఋతువు (Season) :  రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  120

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :  3.2

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  3.0

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : సుడిదోమ, అగ్గితెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) : గింజ సన్నగా పొడవుగా ఉండును. ఎగుమతుల కు అనుకూలం.

8. ప్రభాత్ (యం. టి.యు 3636 - MTU 3636) :

ఋతువు (Season) :  ఖరీఫ్, రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days): 135, 130

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :  2.5, 3.2

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  3.0

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గితెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :

గోదావరి జిల్లాలో దాళ్వాకు అనువైనది, చేను మీద పడిపోదు, ముతక బియ్యం.

9. సోనామసూరీ ఐ. ఆర్.64 (బి.పి.టి 3291 - BPT 3291) :

ఋతువు (Season) :  ఖరీఫ్, రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  135-140, 120

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :  2.5, 3.0

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  2.0, 2.0

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : అగ్గితెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :

గింజ సన్నగా , పొడవుగా అన్నానికి బాగుంటుంది. ఎగుమతుల కు అనుకూలం.

10. నంద్యాల సన్నాలు (ఎన్ డి. ఎల్.ఆర్ 8 - N D L R 8) :

ఋతువు (Season) :  ఖరీఫ్, రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  135, 125

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :  3.0

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : దోమకు 

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  నీటి ఎద్దడిని తట్టుకునే సన్నగింజ రకం, గింజ సాంబ మషురి పోలి ఉంటుంది.

11. పుష్కల (ఆర్.జి.ఎల్ 2624 - RGL 2624) :

ఋతువు (Season) : షష్ఠికం

పంట కాలం (రోజులలో) (crop duration in days):  105

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) : 2.0

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :

ఇతర గుణగణాలు ( Other Attributes ) :

సన్నబియ్యం, అధిక దిగుబడినిచ్చే వర్షాధారపు పంటగా ఉపయోగించవచ్చు.

12. వసుందర (ఆర్.జి.ఎల్ 2538 - RGL 2538) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days):  135

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.5

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  ఉల్లికోడు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  ఆలస్యంగా విత్తి, ( ఆగష్టు - సెప్టెంబర్) ఆలస్యంగా నాటడానికి అనువైనది.

13. క్రొత్త మొలగొలుకు (ఎన్.ఎల్.ఆర్ 9674 - NLR 9674) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days):  165 -170

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.5

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .గింజ వెన్ను పై మొలకెత్తదు, గింజలు మధ్యస్థ సన్నం కలిగి భోజనానికి బాగా అనువైనవి.

14. స్వర్ణముఖి (ఎన్.ఎల్.ఆర్ 145 - NLR 145) :

ఋతువు (Season) :  ఖరీ ఎర్లీ రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  135

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   3.2

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గితెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .నీటి ఎద్దడిని తట్టుకొంటుంది, సన్నబియ్యం, చౌడును తట్టుకొంటుంది.

15. సోమశిల (ఎన్.ఎల్.ఆర్ 33358 - NLR 33358) :

ఋతువు (Season) :  అన్ని కాలలకు

పంట కాలం (రోజులలో) (crop duration in days):  105 - 110

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.5

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .అతిసన్నం, ఎగుమతికి అనువైనవి, చౌడు భూములలో కూడా సాగుకు అనుకూలం.

16. సాంబ మసూరి (బి.పి.టి 5204 - BPT 5204) :

ఋతువు (Season) :  ఖరీఫ్, రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  145 - 150, 135

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.5

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  4

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) : లేదు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .సన్నబియ్యం, అన్నం మృదువుగా రుచిగా ఉండి మెతుకులు అతుక్కోవు. అన్నం ఎక్కువగా ఒదుగుతుంది. గ్లేసిమిక్ ఇండెక్స్ ఒకటికంటే తక్కువగా ఉండి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినుటకు అనుకూలం.

17. పార్థివ (ఎన్.ఎల్.ఆర్ 33892 - NLR 33892) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days):  155

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.2

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : లేదు

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు, దోమపోటు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .సన్నబియ్యం, మొలగొలుకులు రకం, అక్టోబర్ ఆఖరు వరకు నార్లు వేసుకోవచ్చు.

18. నెల్లూరు మసూరి (ఎన్.ఎల్.ఆర్ 34449 - NLR 34449) :

ఋతువు (Season) :  అన్ని కాలలకు

పంట కాలం (రోజులలో) (crop duration in days):  125

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   3.2

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు 

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .చేను మీద పడిపోదు, పొట్టిరకం, గింజ నాణ్యత కలిగి, అగ్గి తెగులును తట్టుకొనును.

19. నెల్లూరు సోనా (ఎన్.ఎల్.ఆర్ 3140 - NLR 3140) :

ఋతువు (Season) :  ఖరీఫ్

పంట కాలం (రోజులలో) (crop duration in days):  140

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   3

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .అతిసన్నం, అన్నానికి బాగుంటుంది. తక్కువ నత్రజని తో ఎక్కువ దిగుబడినిస్తుంది.

20. శ్వేత (ఎన్.ఎల్.ఆర్ 40024 - NLR 40024) :

ఋతువు (Season) :  రబీ, ఎడగారు

పంట కాలం (రోజులలో) (crop duration in days):  120

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.9

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .బియ్యం మధ్యస్థ, అధిక ఉష్ణోగ్రత తట్టుకొని దక్షణ మండలం లో ఎడగారు కాలానికి అనువైన రకం.

21. శ్రీధృతి (యం.టి.యు 1121 - MTU 1121) :

ఋతువు (Season) :  రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  120 - 125

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.41

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) : 

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు, దోమ.

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు. మధ్యస్థ సన్న బియ్యం, పచ్చి బియ్యం కి అనుకూలం. నేరుగా విత్తే విధానం లో సాగుకి, మిషన్ కోతకు కూడా అనుకూలమైనది.

22. చంద్ర (యం.టి.యు 1153 - MTU 1153) :

ఋతువు (Season) :  రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  120

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.8-3.0

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  2

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు, దోమ పోటు.

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు. గింజ రాలేదు, గింజ చేను పై మొలకెత్తదు, గింజలు లావుగా, పొడవుగా ఉండి ధాన్యము మరియు బియ్యం తెలుపు రంగులో ఉండును. బియ్యం పొట్ట తెలుగు లేకుండా పారదర్శకంగా ఉండును. ఈ రకం 8 రాష్ట్రంలలో సాగుకి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విడుదల చేయబడినది.

23. క్షీర (యం.టి.యు 1172 - MTU 1172) :

ఋతువు (Season) :  రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  150

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.4

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  2

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .జాతీయ స్థాయిలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మధ్యస్థ ముంపు ప్రాంతాల్లో సాగుకు విడుదల చేయబడినది. ఈ రకం మధ్యస్థ సన్న బియ్యం, ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. 10 రోజులు ముంపుతో పాటు, అడుగున్నార నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాలలో సాగు చేయవచ్చు.

24. పాండురంగా (యం.సి.యు 100 - MCU 100) :

ఋతువు (Season) :  రబీ

పంట కాలం (రోజులలో) (crop duration in days):  145

దిగుబడి (ఎ / టన్నుల్లో) (Yield in tons) :   2.4

గింజ నిద్రావస్థ(వారాలు) (Nut Hibernation) :  2-3

తెగుళ్లను తట్టుకొనే శక్తి (Pest Resistance Power) :  అగ్గి తెగులు, ఆకుపచ్చ తెగులు.

ఇతర గుణగణాలు ( Other Attributes ) :  .చౌడును సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకం. చేను పై పడదు, గింజ రాలేదు, మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ధాన్యం తెలుపు రంగులో ఉండును. ముదురు నారు ఊడ్చిన పంట దిగుబడి బాగుంటుంది.

No comments