వరి నాట్లు వేసే సమయంలో రైతు కోసం ఓ క్రొత్త పద్దతిలో వరి సాగు విధానం వివరణ | A new method of cultivating paddy for the farmer at the time of sowing | raithubadi
రైతన్నలకు ఓ చిన్న మనవి ,
చాలా మంది రైతులు చాలా సంవత్సరాలు గా వరి సాగు చేస్తున్నారు. మీ విధానాలలో ఎన్నో లోటుపాట్లను ఎదురుకుంటూ లాభాలు వచ్చినా రాకపోయినా మీరు మాత్రం అలుపెరగని సైనికునిలా పోరాడుతూ, అధిక పెట్టుబడులు పెడుతూ , నష్టపోతు, ప్రజలకు నాలుగు మెతుకులు దొరికేలా చేస్తున్నారు. అయితే మీరు సాగు చేసే పంట అధిక రావడానికి, ఎక్కువగా Chemical ఎరువులు, విషపూరితమైన క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అందువల్ల మీకు అధిక డబ్బు ఖర్చు కావడమే కాకా ప్రజలు అనారోగ్యాపాలు అవుతున్నారు, మీ తర్వాత తరాలవారు శక్తి హీనులు, ఆయుష్ హీనులు అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా రైతుల కోసం ఎంతో కృషి చేస్తోంది. ఎంతో వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేస్తుంది. అయినా ఎక్కడో లోపం కనిపిస్తూనే ఉంది. కారణం ఏమిటి?
కాలం తో పాటు ఎన్నో మారుతున్నాయి. మనము మారుతున్నాము , మన వ్యవసాయ విధానాలలోనూ మార్పులు వచ్చాయి, కానీ ఏ దిశగా వెళ్తున్నాయి.ఒక్కసారి ఆలోచించండి , ప్రతీ రైతు లోను ఒక కొత్త ఆలోచనలు రావాలి. మీకు , మీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరిగేలా ఆలోచించండి, ఆచరించండి అందరికి ఆదర్శవంతులు ఉండాలని కోరుకుంటూ , ఈ సుత్తి అంతా ఎందుకు అనుకోకండి, మీకు ఉన్న పొలము 5 ఎకారముల కంటే ఎక్కువ ఉంటే అందులో ఒక అర ఎకరా పొలం లో పంట సాగులో ఏదైనా కొత్త ప్రయోగాలు చెయ్యండి, భావి తరాలకు , మీ కొడుకులు, మనవడ్లు , మీ వంశాల వారికి మీరే దేవుళ్లు అవుతారు.
అందుకోసం ప్రభుత్వ సహాయం తీసుకోండి, తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి , పరిశీలించండి, వెతకండి సాదించండి. ఈ విధంగా కొంత మంది 10% ప్రయత్నిస్తూనే ఉన్నారు , వారికి మా ధన్యవాదాలు.
ఈ విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించి లాభాలు పొందుతున్న వారిలో ఒకరు అయినా కౌటిల్య కృష్ణన్ గురించి మీకు ఒక ఉదాహరణ గా చెప్పబోతున్నాను దయచేసి పూర్తిగా చదవండి.
కౌటిల్య కృష్ణన్ ఒక వేద విద్యార్థి. ఈయనకు వ్యవసాయం లో అనుభవం లేదు, అయినా ఆయనకు వ్యవసాయం పై ఉన్న మక్కువ ఆయనను విజయం వైపు నడిపించింది. ఇంతకీ ఈయన ఏమి చేశారు అంటే , వేదాలు అబ్యాసం చేశాడు, ఆ వేదాలలో వ్యవసాయం గురించి ఎప్పుడో వ్రాయబడి ఉన్నాయట. ఆ వేదాలలోని ఋగ్వేదం లో వ్యవసాయం గురించి చాలా అద్భుతంగా, ఖర్చు తక్కువగా, అధిక ఆరోగ్యము , ఆదాయము వచ్చేలా వివరించబడి ఉందట.
అప్పుడే కౌటిల్య కృష్ణన్ ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వైదిక విధానం లో వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో అని, దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలనుకుని ఆయన మొదటగా నల్ల రైస్(నల్ల బియ్యం, నల్ల వరి) ని ఎంచుకోని వైదిక విధానం లో నల్ల వరి సాగు చేసి విజయం సాధించారు.
ఆయన నల్ల బియ్యం తీసుకుంటే మీరు మాములు ప్రజలు వాడే తెల్ల వరి సాగు నే ఈ వైదిక విధానంలో try చేయండి. ఈ వైదిక విధానంలో వరి సాగు గురించి సాక్షి పత్రిక లో వేశారు. ఆ వివరాలు ఈ క్రింద ఇస్తున్నాను చదువుకోండి. Try చేయండి , ఇంకా ఏమైనా సమాచారం కావాలి అంటే comment బాక్స్ లో వ్రాయండి లేదా మమ్మల్ని సంప్రదించండి. మీరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ మీ raithubadi రైతు బడి.
Post a Comment