వరిలో ఉల్లికోడు పురుగులు వాటి నివారణ | Prevention of ullikodu purugulu in paddy | Prevention of ullikodu worms in rice | raithubadi
![]() |
Ullikodu Worms |
ఉల్లికోడు పురుగు :
Prevention of ullikodu purugulu in paddy దోమ జాతికి చెందిన ఉల్లికోడు పెద్ద పురుగులు ముదురు ఎరుపు రంగులు ఉండి కాండం పై గుడ్లను పెడతాయి. దీపపు ఎరలు అమర్చి పొలంలో వీటి ఉనికిని గమనించవచ్చును. గుడ్డు నుంచి వచ్చిన వెంటనే పిల్ల పురుగులు (మాగట్స్) కాండంలోనికి పోయి అంకురం వద్ద వృద్ధి చెందే క్రమంలో అంకురం ఉల్లికాడ వలె లేత ఆకుపచ్చ ని పొడుగాటి గొట్టంగా మార్పు చెంది బయటకు వస్తుంది. కంకి వేయదు. దుబ్బులలోని కొన్ని పిలకలు మాత్రమే ఉల్లి కాడవలె గొట్టాలుగా మారుతాయి.
![]() |
Ullikodu |
Prevention of ullikodu purugulu in paddy ఉల్లి కోడు తట్టుకోలేని రకాలను సాగు చేసినప్పుడు, వర్షాలు ఆలస్యం అయి, నాట్లు ఆలస్యమైనపుడు, గాలిలో తేమశాతం 82-88 మధ్య వర్షాలు కురిసినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది.
నారుమడిలో చ.మీ.కు ఒక ఉల్లికోడు సోకిన పిలక, పిలక దశలో 5 శాతం ఉల్లి గొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారుమడిలో మొలకెత్తిన 10-15 రోజులలో ఒక సెంటు నారుమడికి 160 గ్రా. కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు పలుచగా నారుకి నీరు పెట్టి చల్లి ఆ మడిలోనే ఇంకెటట్లు చేయాలి.
నాట్లు ఆలస్యంగా వేసినప్పుడు, నాటిన 10-15 కిలోలు పలుచగా నీరు పెట్టి పొలంలో చల్లాలి. గుళికలు వేయలేని పరిస్థితులలో ఎకరానికి పిప్రొనిల్ 400 మి. లీ. లేదా కార్బో సల్ఫాన్ 400 మి. లీ. లేదా క్లోరిపైరిఫాస్ 500మి. లీ. మందులలో ఏదో ఒక మందును 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Prevention of ullikodu purugulu in paddy రైతులు తైవాన్ స్ప్రేయర్ వాడేటప్పుడు ఎకరానికి 80-100 లీటర్ల నీటిని మాత్రమే పిచికారి చేయవలెను. రైతులు తప్పనిసరిగా పొటాష్ ఎరువులను దుక్కిలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వాడి, పైపాటుగా మిశ్రమ ఎరువులు వాడకుండా యూరియా, పొటాష్ ఎరువులను వాడి పెట్టుబడి ఖర్చు తగ్గించుకొనవలెను.
Post a Comment