Header Ads

Method of Producing Good paddy Seeds | గ్రామీణ విత్తనోత్పత్తి పథకం లో బాగంగా విత్తనాలను ఉత్పత్తి చేసే విధానము

 గ్రామీణ విత్తనోత్పత్తి పథకం లో బాగంగా విత్తనాలను ఉత్పత్తి చేసే విధానము 

https://raithubadi.blogspot.com


ఫౌండేషన్ విత్తనం

విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విత్తనాభివృద్ధి క్షేత్రాలలో సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు.

(దీనికి తెలుపు రంగు ట్యాగ్ ఉంటుంది)

 

సర్టిఫైడ్ / ధృవీకరణ విత్తనం

సీడ్ సర్టిఫికేషన్ వారి పర్యవేక్షణలో రైతులు వారి పొలాలలో ఉత్పత్తి చేస్తారు. ప్రయోగశాలలో పరీక్షించి ధ్రువీకరణ విత్తనం లేబుల్ ఇస్తారు. (దీనికి లేత నీలి రంగు ట్యాగ్ ఉంటుంది.)

 

ఇవి కాక మరో రకం విత్తనం ట్రూత్ ఫుల్ లేబుల్ విత్తనం

ఇది ధ్రువీకరణ క్రిందకు రాదు. దీని ఉత్పత్తి దారులు స్వంత పూచీతో ఉత్పత్తి చేసి ట్రూత్ ఫుల్ లేబుల్ అని ట్యాగ్ వేసి విక్రయిస్తారు.

(దీనికి లేత ఆకుపచ్చ ట్యాగ్ ఉంటుంది)


విత్తనోత్పత్తిలో ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు

1. జన్యుస్వచ్ఛత

2. భౌతిక స్వచ్ఛత

3. మొలకెత్తే స్వభావం

 

1. Precautions to be taken for genetic purity(జన్యుస్వచ్చతకు తీసుకోవలసిన జాగ్రత్తలు):-

  • జన్యుస్వచ్చతకు పరపరాగ సంపర్కము ద్వారా కల్తీలను నియంత్రించుటకు ఇతర రకాలకు కనీసం 3 మీటర్ల దూరంలో పండించాలి.

2. Precautions to be taken for physical cleanliness(భౌతిక స్వచ్ఛతకు తీసుకోవాల్సిన  జాగ్రత్తలు) :-

  • భౌతిక స్వచ్ఛత కొరకు పైరు దుబ్బు చేసే సమయంలో పూత దశలో గింజ గట్టిపడే దశలో కేళీలను  ఏరివేయాలి. ఒక్క కల్తీ మొక్కను వదిలినా షుమారు 1000 గింజలు రాబోయే పైరులో కేళీలుగా తయారవుతాయి.
  • గట్లమీద, చేలోను, కలుపుని సమర్థవంతంగా నిర్మూలించిన కలుపు విత్తనాలుకలిసే అవకాశముండదు.
  • ట్రాక్టరుతో కాకుండా జాగ్రత్తగా బల్లమీద నూర్చి ఇతర విత్తనాలు కలవకుండా నివారించాలి.
  • క్రొత్త సంచులను విత్తన నిల్వలకు వాడిన కల్తీలను నివారించవచ్చును.

3. Precautions to be taken to prevent damage to germination(మొలకెత్తే స్వభావం దెబ్బతినకుండా తీసుకోవలసిన జాగ్రత్తాలు):-

  • పాలుపోసుకునే దశలో ఎరువులు వేసిన గింజలు విరిగిపోతాయి.
  • పక్వానికి రాకముందే కొస్తే మొలకెత్తే స్వభావం దెబ్బతింటుంది. గింజ బాగా గట్టిపడేవరకూ ఉంచితే గింజ నాణ్యత దెబ్బతింటుంది. గింజలు రాలిపోతాయి.
  • విత్తనాలను ఎండలో మందపు పొరగా ఎండబెట్టాలి. క్రమంగా పల్చగా ఎండబెట్టాలి. 9-11 గంటల మధ్య ఎండబెట్టాలి. 5-6 రోజులు ఆరబెట్టాలి. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నా గింజలమీద పగుళ్లు ఏర్పడతాయి.
  • తేమశాతం 13-14 ఉండేలా ఆరబెట్టాలి. అధిక తేమశాతం వలన గింజలు చెడిపోతాయి.
  • నాణ్యమైన విత్తనోత్పత్తికి ఎరువుల యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ ముఖ్యమైనది.

 

Current practices in seed production(విత్తనోత్పత్తిలో ప్రస్తుతం పాటించవలసిన మెళుకువలు):-

  • నారుమడిని 10-12 రోజుల ముందే చదును చేసి నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేయాలి.
  • 5 సెంట్ల నారుమడికి 1కిలో నత్రజని, 1కిలో భాస్వరము , 1కిలో పొటాషియం యిచ్చే ఎరువులను(ఉదా . 20:20:0 5కిలోలు , యం..పి  1.కిలో) వేయాలి. విత్తన 12-14 రోజులలో 1కిలో నత్రజని (ఉదా . 2కిలో యూరియా) ఎరువులను వేయాలి.
  • విత్తన శుద్ధి తప్పక చేయాలి. కిలో విత్తనాన్ని 2గ్రా కార్బండిజం లేక 3గ్రా మాంకోజెబ్ కలపాలి.
  • సెంటుకు 5కిలోల చొప్పున శుద్ధి చేసిన విత్తనాన్ని చల్లాలి.
  • నారు ఒక ఆకు పూర్తిగా విచుకునే వరకు ఆరు తడులు ఇచ్చి తరువాత పలుచగా నీరు పెట్టాలి.
  • వానపాముల ఎరువులను వేయటం వలన నారు ఆరోగ్యాంగా ఉండి నారు తీసేటప్పుడు వేర్లు తెగకుండా ఉంటాయి.
  • సెంటు నారుమడికి 160గ్రా. కార్టోప్యూరాన్ 3 జి. గుళికలు నారతీయుటకు 5-7 రోజుల ముందు వేయండి - నాటిన 30 రోజుల వ్యవధి వరకు పురుగు తాకిడిని తగ్గిస్తుంది
  • నారు తీసేటప్పుడు   మొక్కలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటే త్వరగా నాటుకొని పిలకలు తొడుగుతుంది.
  • నారు తీసే 7-10 రోజుల లోపు నత్రజని ఎరువు వేయరాదు.
  • నారుమడిలో కలుపు సమస్యగా ఉన్న ప్రాంతాలలో విత్తిన 12-15 రోజులలో సైహాలోపాప్ బ్యూటైల్ 400 మి.లీ చొప్పున ఎకరాకు పిచికారీ చెయ్యాలి.
  • సేంద్రీయ ఎరువులు వేయండి - బిడ్డకు తల్లి పాలెంత శ్రేష్టమో, నేలకు  సేంద్రీయ ఎరువులంత శ్రేష్టం.
  • వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే గాక సుమారు 20-25 శాతం నత్రజని, భాస్వరం, పోటాష్ లను కూడా ఆదా చేయవచ్చు.
  • పూర్తిగా రసాయన ఎరువులు వాడిన పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించి ఖర్చు పెరగటం, దిగుబడి నాణ్యత తగ్గుతుంది. కాబట్టి సెంద్రీయ ఎరువులను వేయడం వలన నాణ్యమైన అధిక దిగుబడిని పొందవచ్చు.
  • దుక్కిలో ఎకరానికి 15కిలోల మ్యూరేట్ ఆప్ పోటాష్ మరియు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25కిలోల యూరియా లేక 50కిలోల డి..పి వేయండి - అధిక పెట్టుబడిని అరికట్టండి.
  • ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ ను 2 ఫైర్లకు ఒకసారి వేయండి -జింక్ లోపాన్ని నివారించండి.
  • పోటాష్ ని దుక్కిలోను, చిరుపొట్ట దశలోను వేయండి-గింజ నాణ్యత పెరుగుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • జింక్, భాస్వరం కలిపి వేయకండి, మొక్కకు అన్ని పోషకాలు అందవు. 2-3రోజులు వ్యవధి పాటించండి.
  • తాడు సహాయంతో వరుసల మధ్య 20 సెంమీ. మొక్కల మధ్య 15సెంమీ. ఉండేటట్లు వరుసలలో నాట్లువేయండి దోమాతాకిడి తగ్గుతుంది.
  • చలప, చలప నీటిలో పైపైన నాటండి పిలకలు సంఖ్య పెరుగుతాయి .
  • 2మీటర్లకు దారులు తీయండి - దోమాతాకిడి తగ్గుతుంది.
  • యూరియాని 4 దఫాలుగా వేయండి అగ్గితెగులును, దోమను నియంత్రిస్తుంది.
  • పై పాటుగా వేసే యూరియాను వేపపిండి లేక వేప నూనె పట్టించి వేయండి- కీటకాలను, యూరియా వృధాను అరికడుతుంది.
  • పై పాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయకండి - అధిక పెట్టుబడులను అరికట్టండి.
  • ఎకరాకు 4కిలోల బ్యుటాక్లోర్ గుళికలు మరియు 4 కిలోల 2,4డి -ఇథైల్ ఈస్టర్ గుళికలు 20కిలోల పొడి ఇసుకతో కలిపి నాటిన 3-5 రోజులలో పలుచని నీరు ఉన్నప్పుడు సమానంగా వెదజల్లండి - అన్నిరకాల కలుపును నివారిస్తుంది. బిస్ పైరిబాక్ సోడియం(నామినీగోల్డ్ 100 మి.లీ 15-20రోజులలో మరియు ఈదాక్సి సల్ఫ్యూరిన్ 20 రోజులపైనా ఎకరానికి 50గ్రా కొప్పున వాడి గడ్డి జాతి కలుపును నివారించవచ్చును.
  • ఆకులు పసుపు రంగుకు మారటం లేక తెల్లబడితే ఇనుపధాతు లోపముగా గుర్తించి లీటరు నీటికి 20గ్రా అన్న బేదీకి 2గ్రా నిమ్మఉప్పు లేక నిమ్మ రసం కలిపి ఎకరానికి 200 లీ. పిచికారీ చేయండి. 4,5 రోజుల వ్యవధిలో ఆకులూ ఆకుపచ్చ రంగులో మారేవరకు 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయండి.
  • 3, 4 ఆకు మధ్య ఈనె  తెల్లబడి, ముదురు ఆకులపై తుప్పు రంగు మచ్చలు ఏర్పడటం, మొక్క సరిగ్గా ఎదగలేక పోవడం జింకు లోపంగా గుర్తించి లీటరు నీటికి 2గ్రా జింక్ సల్ఫేట్ కలిపినా ద్రావణం ఎకరానికి 200 లీటర్లు చొప్పున 5రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.
  • ముఖ్యం గా అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడటం వలన దిగుబడి పెరిగినప్పటికి  నికరాదాయం శున్యం . కాబట్టి భూసార పరీక్షను అనుసరించి సిఫారసు చేసిన మోతాదులో రసాయన, మరియు సేంద్రీయ ఎరువులు వాడినప్పుడే నికరాదాయం పొందవచ్చును.
  • పిలకలు వేసే దశలో 2 సెం.మీ మాత్రమే నీరు ఉంచాలి.

https://raithubadi.blogspot.com

Fertilizer dose(ఎరువుల మోతాదు) 

భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదు నిర్ణయించాలి. లేనికా సాధారణ ఎరువుల నత్రజని 32 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పొటాషియం 16కిలోల పోషకాలనిచ్చే ఎరువులను వేయాలి. 

https://raithubadi.blogspot.com






No comments