Header Ads

మిరప లో పురుగులు నివారణ మరియు అధిక ఆదాయ మార్గాలు | Prevention of pests in chili and sources of higher income | Raithubadi

 మిరప లో పురుగులు నివారణ మరియు అధిక ఆదాయ మార్గాలు 
 Prevention of pests in chili and sources of higher income.


https://raithubadi.blogspot.com/2023/08/Prevention%20of%20pests%20in%20chili%20and%20sources%20of%20higher%20income.html


నల్లతామర పురుగు : 

మిరపలో త్రిప్స్ పార్విస్పైనస్ నలుపు రంగులో ఉండి పువ్వులోని భాగాలను ఆశించటం వలన పూతరాలటం జరుగుతుంది. స్పర్శశ్రుంగాలు ఏడు ఖండితాలు కలిగి తక్కువ వెంట్రుకలు ఉంటాయి. వర్షాధార పంటలలో పొడి వాతావరణ పరిస్థితులలో ఇది ప్రధాన సమస్య. ఆధిక వర్షపాతం నమోదయ్యే ఈశాన్య రుతుపవనాల సమయంలో ఈ పురుగు అధిక నష్టం కలుగచేస్తుంది.
https://raithubadi.blogspot.com/2023/08/Prevention%20of%20pests%20in%20chili%20and%20sources%20of%20higher%20income.html


Black thrips: Thrips parvispinus in pepper is black in color and feeds on parts of the flower causing blisters. The antennae are seven-segmented and sparsely hairy. It is a major problem in dry weather conditions in rainfed crops. This insect causes heavy damage during the North-East Monsoons when there is heavy rainfall.

సమగ్ర యాజమాన్య చర్యలు : 

సాధ్యమైనంత ముందరగా మిరప రైతులు సామూహికంగా ఒకేసారి నాట్లు పూర్తి చేసుకోవాలి. సామూహికంగా నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 40-50 వరకు మొక్క ఎత్తుకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. వేప సంబంధిత పురుగు మందులు అంటే 15% వేపగింజల కషాయాన్ని కానీ, వేపనూనె (10,000 పిపిఎం, 1 మి.లీ. గానీ లీటరు నీటికి 1,500 పిపిఎం లేదా 3,000 పిపిఎం 2 మి.లీ/లీ నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేయాలి. వేపనూనెను సిఫారసు చేసిన ఇతర మందులతో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. గానుగ నూనె 2 మి.లీ. / లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు.

Comprehensive Ownership Measures: As early as possible, chilli farmers should collectively complete the planting at once. Maternal infestation can be reduced by mass planting 40-50 per acre of blue glue sticks close to plant height. Neem insecticides are 15% neem seed decoction, neem oil (10,000 ppm, 1 ml) or 1,500 ppm per liter of water or 3,000 ppm per 2 ml/l of water mixed with glue. Neem oil can also be sprayed with other recommended drugs. Ganuga oil can be sprayed with glue at 2 ml / liter of water.

తెల్లనల్లి (కింది ముడత): 

https://raithubadi.blogspot.com/2023/08/Prevention%20of%20pests%20in%20chili%20and%20sources%20of%20higher%20income.html
తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చటం వలన ఆకులు క్రిందికి ముడుచుకుని తిరగబడిన పడవ ఆకారంలో కనపడ తాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కలు పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడతాయి. దీని నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. లేదా నీళ్లలో కరిగే గంధకం 3 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

Leaf blight (lower blight): Leaf blight causes the leaves to curl downwards and appear in the shape of an inverted boat due to leaf blight.

The stems of the leaves stretch and turn dark green. Plants stunt growth and tender leaves die off. For its prevention Dicofal 5 ml. or 3 g of water-soluble sulphur. Mix in one liter of water and spray.

https://raithubadi.blogspot.com/2023/08/Prevention%20of%20pests%20in%20chili%20and%20sources%20of%20higher%20income.html
సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు వాడరాదు. నత్రజని ఎరువులు తగ్గించాలి. పైముడత, క్రింది ముడత
ఉధృతి ఒకేసారి గమనించినచో ఉధృతిని బట్టి స్పైరోమెసిఫిన్ 0.8 మి.లీ. లీటరు లేదా డైఫెన్థయురాన్ 1.5 గ్రా. లేదా క్లోరోఫెనాఫైర్ 2 మి.లీ. లేదా ప్రొఫెరైట్ 2 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి.

Synthetic pyrethroid drugs should not be used. Reduce nitrogen fertilizers. Spiromesifin 0.8 ml is given depending on the severity if both upper and lower folds are observed at the same time. liter or difenthiuron 1.5 g. or chlorfenafir 2 ml. Or Proferite 2 ml. Spray with one liter of water should be done

పేనుబంక: 

https://raithubadi.blogspot.com/2023/08/Prevention%20of%20pests%20in%20chili%20and%20sources%20of%20higher%20income.html
పేనుబంక లేత కొమ్మలు, ఆకుల అడుగున చేరి రసాన్నిపీల్చటం వలన పెరుగుదల తగ్గుతుంది. తియ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు, నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. 

దీని నివారణకు థైక్లోప్రిడ్ 0.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. ఎసిటామిప్రిడ్ @ 0.2 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

Aphids attach to tender twigs and undersides of leaves and sap inhalation reduces growth. Due to excretion of sweet substance Attracts ants. leaves, The pods turn black and gooey. 

To prevent this Thicloprid 0.6 ml or Acephate 1.5 g. or imidacloprid 0.3 ml. Acetamiprid @ 0.2 g. Mix in one liter of water and spray.

పూత పురుగు: 

https://raithubadi.blogspot.com/2023/08/Prevention%20of%20pests%20in%20chili%20and%20sources%20of%20higher%20income.html
పూత పురుగు దోమ జాతికి చెందినది. పిల్ల పురుగులు మొగ్గలు, పూత, పిందెలను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. అండాశయం తొలిచి చూస్తే ఈ ఈగ యొక్క పిల్ల పురుగులను, ప్యూపాలను గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే దాదాపు 40 శాతం వరకు పూతరాలిపోతుంది. ఈ పురుగు సోకిన ఈ ఎడల పూత ఎండి రాలిపోవడం వల్ల కాయలు ఏర్పడవు. 

ఏర్పడిన కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకరలు తిరిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్ ధర తగ్గిపోతుంది. ముందస్తు చర్యగా పూత దశకు కొంచెం ముందుగా వేపనూనె 10,000 పిపిఎం, 2 మి.లీ నీటిలో కలిపి చేయాలి. క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Cutworm: Cutworm belongs to the genus of mosquito. Larvae feed on buds, sheaths and pods and damage them. The ovary swells white in the infested crust. If the ovary is removed, the larvae and pupae of this fly can be observed. This If the infestation is high up to about 40 percent coating will fall Infected with this worm due to the dry coating nuts are not formed. 

Nuts formed due to the change in the shape of Gidasabari and return of curls, the quality is lost and the market price is reduced. As a pre-treatment, neem oil 10,000 ppm in 2 ml of water should be added just prior to the coating stage. Chlorantraniliprole 0.3 ml. One liter of water should be mixed and sprayed.

కాయతొలుచు పురుగులు (పొగాకు లద్దె పురుగు,
శనగపచ్చ పురుగు, పచ్చ రబ్బరు పురుగు):

https://raithubadi.blogspot.com/2023/08/Prevention%20of%20pests%20in%20chili%20and%20sources%20of%20higher%20income.html
లద్దె పురుగులు మొదటి దశలో ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినివేస్తాయి. పంటకు విపరీతమైన నష్టంవాటిల్లుతుంది.

దీని నివారణకు ఒక లీటరు నీటికి స్పైనోసాడ్ 0.25 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. సమగ్ర సస్యరక్షణ అవలంబించాలి. కీటక పెరుగుదల నియంత్రణకు నొవల్యూరాన్ 1 మి.లీ. లేదా డ్రైఫ్లూబెంజురాన్ 1 గ్రా. లాంటి మందులతో గ్రుడ్ల నుండి అప్పుడే బయటకు వచ్చే పిల్ల పురుగులను అరికట్టవచ్చు. విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను నివారించవచ్చు. విషపు ఎరను 5 కె.జి తవుడు, 500 గ్రా. బెల్లంతో తగినంత నీటిని కలిపి తయారు చేయాలి. 

ఈ విధంగా తయారుచేసిన చిన్నచిన్న గుళికలను సాయంత్రం వేళ పంటపొలంలో సమానంగా చల్లితే నెర్రెలలో దాగి ఉన్న పురుగులు రాత్రులందు బయటకు వచ్చి ఈ గుళికలను తినటం వలన చనిపోతాయి. కాయ తొలుచు పురుగుల ఉధృతి, ఉనికిని గుర్తించటానికి ఎకరానికి కనీసం 4 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఎరలను మాత్రం 25 రోజుల కొకసారి మార్చాలి. వేసవిలో నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడేలా, లోతు దుక్కులు దున్నాలి. 

విచక్షణా రహితంగా పురుగు మందులు వాడరాదు. ఆకర్షణ పైర్లుగా ఆముదం, బంతి మొక్కలు పొలంలో వేసుకోవాలి. జీవనియంత్రణ ద్వారా శనగపచ్చ పురుగు నివారణకు హెచ్ఎన్ఎ్పవిని పొగాకు లద్దె పురుగు నివారణకు ఎస్ఎస్పి విని వాడాలి.

Pod borers (tobacco borer,

Cutworm, green rubber worm):

Bollworms first damage the leaves and then enter the pods and eat the seeds. The crop will be severely damaged.

For its prevention Spinosad 0.25 ml per liter of water. Spray together. Comprehensive plant protection should be adopted. Novaluron 1 ml for control of insect growth. or dryflubenzuron 1 gm. Baby worms that just come out of the nests can be prevented with similar drugs. Well-grown caterpillars can be prevented by poisoned baits. 5 kg of poison bait, 500 g. Mix enough water with jaggery to make it. Small pellets prepared in this way in the crop field in the evening

If evenly sprinkled, the worms hidden in the berries will come out at night and eat these pellets and die. Incidence of pod borer, per acre to determine presence at least 4 sexual attractive baskets should be installed. The baits should be changed every 25 days. In summer, deep furrows should be plowed to release the dormant worms. Pesticides should not be used indiscriminately. Castor and ball plants should be planted in the field as attraction piers. Hnpavini tobacco borer for control of bean green borer through biological control SSP should be used for prevention.

No comments