Header Ads

మిరప పంటను ఆశిస్తున్న తామర పురుగులు నివారణ | Prevention of eczema mites in expectation of chilli crop | raithubadi


ప్రస్తుతం మిరప పంటను chilli crop ఆశిస్తున్న తామర పురుగులను గమనించినట్లైతే తల్లి మరియు పిల్ల పురుగులు గోధుమ వర్ణంలో ఉండి, ఆకుల అడుగు భాగములో గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. 

దీని వల్ల ఆకులపై బొబ్బలుగా ఏర్పడి ఆకుల అంచులు నుండి లోపలికి ముడుచుకుపోవడం వల్ల దీనిని పై ముడత అంటారు. ఇప్పుడు మిరప పంటను chilli crop  ఆశించిన తామర పురుగులను గమనిస్తే పిల్ల పురుగులు లేత రంగులో ఉండి తర్వాత దశలు లేత పసుపు లేదా గోధుమ వర్ణంలో ఉండి తల్లి పురుగులు నలుపు వర్ణంలో ఉండి వీటి పరిమాణము కూడా పెద్దదిగా ఉండటం  గమనించడం జరిగింది.


మిరపపంట chilli crop మీద ఆశించినప్పుడు వీటి లక్షణాలను గమనించినట్లైతే ఇవి ఆకులపై మరియు పూతలో ఎక్కువ సంఖ్యలో ఉండి, పాత్రహరితాన్ని విపరీతంగా గీకివేయడం మరియు వాటి గ్రుడ్లను ఆకు లోపలికి చొప్పించడం వలన ఆకులు పాత్రహరితాన్ని కోల్పోయి, ఇటుక రాయి రంగులోకి మారడం జరుగుతుంది. ఇవి రసం పీల్చడమే కాకుండా గ్రుడ్లు పెట్టిన ప్రాంతంలో కూడా కణజాలం దెబ్బతినడం వలన ఆకులు మాడిపోయినట్లు కనిపించడం జరుగుతుంది.

ఈ పురిగులు మన ప్రాంతాల్లో మిరప పంటనే కాక వివిధ రకాల కూరగాయ పంటలు అయినటువంటి వంగ, టమాట, పప్పుధాన్య పంటలు, తీగజాతి కూరగాయలు, పుచ్చ మరియు కర్బూజ జాతి పంటలను కూడా ఆసిస్తుందని గమనించడం జరిగింది. ఇవి ఎక్కువ సంఖ్యలో పూలలో గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి పూలలో పుప్పొడిని మరియు పూత కణజాలం ను కూడా తిని నష్టపరుస్తాయి. కావున వీటిని ప్లవర్ ట్రిప్స్ లేదా పూతను ఆశించే తామర పురుగులు  eczema mites   అని అంటారు. 

పంటను నష్టపరిచే విధానం:  ఇవి పంటను రెండు విధాలుగా నష్ట పరుస్తున్నట్లు గమనించడం జరిగింది.

1. ఇవి అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నందున పంట మీద విపరీతమైన సంఖ్యలో ఆశించి రసం పీల్చడం మరియు గ్రుడ్లు పెట్టడం వలన ఆకులు మరియు పూత కణజాలం మాడిపోవడం జరుగుతుంది. 

2. ఇవి రసం పీల్చడం ద్వారా ఒక మొక్క నుండి మరో మొక్కకు 'పీనాట్ బడ్ నెక్రోసిస్  వైరస్' అనే వైరస్ వ్యపించడానికి కారణం అవుతున్నాయి. 


రైతులు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు : 

1.రైతులు భయాందోళనలో విపరీతంగా మందులు పిచికారీ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని రకాల సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు వాడటం వల్ల వీటిలో గ్రుడ్లు పెట్టే సామర్థ్యం ఎక్కువయినట్లు గుర్తించడం జరిగింది. కావున సింథటిక్ పైరిత్రాయిడ్ మందుల వాడకాన్ని తగ్గించాలి.

2. రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో నీలం రంగు మరియు పసుపు రంగు అట్టలను పొలములో పెట్టుకోవడం ద్వారా వీటి సంఖ్య ను తగ్గించుకునే అవకాశముంది. 


3. ఇవి మనం వాడే అన్ని రకాల పురుగు మందులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నందున పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టం.

4. ఈ పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేపకి సంబంధించిన పురుగు మందులు పిచికారి చేసుకోవాలి. దీనికి గాను వేపనూనె 10000 పి.పి.యం. 3మీ.లీ. లీటరు నీటికి మరియు 0.5 గ్రా. సర్ఫ్ కాని ట్రైటాన్ 'x' -100 గాని కలిపి పిచికారి చేసుకోవాలి. 

5. ముఖ్య గమనిక : వివిధ రకాల పురుగు మందులు అయినటువంటి స్పైనోసాడ్, సింథటిక్ పైరిత్రాయిడ్ లు , ఆర్గాన్ ఫాస్ఫాట్స్ (ప్రొఫెనోఫాస్), నియోనికోటినాయిడ్స్ (ఇమిడాక్లోప్రిడ్) వంటి మందులకు ఈ పురుగులు లొంగకుండా తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి.

6. వీటి నివారణకు మనకు అందుబాటులో ఉన్న పురుగు మందులు ఎసిటామిప్రిడ్ (ప్రైడ్) 80 -100గ్రా. లేదా సయాంట్రనిలిప్రోల్ (బేనీవియా) 240 మి. లీ. లేదా రీజెంట్ 80 డబ్ల్యూ.జి. లేదా పోలీస్ (40% ఇమిడాక్లోప్రైడ్ + ఫిప్రో నిల్ 40% డబ్ల్యూ.జి.) 80గ్రా. - 100 గ్రా. ఎకరానికి మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవడం వల్ల ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన
ఫోన్ నెం : 99891 92223

No comments