Header Ads

శనగ పంటలో గాలి ద్వారా వ్యాపించే తెగుళ్ళు వాటి నివారణ | Prevention of airborne pests in Bengal Gram crop | raithubadi

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనగ పంట సుమారుగా 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగుబడిలోవుంది. ఈ శనగ పంటను వివిధ రకాల నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు ( మొదలు కుళ్లు, వేరు కుళ్లు మరియు ఎండు తెగుళ్ళు) మరియు గాలి ద్వారా సంక్రమించే మరియు వ్యాపించే తెగుళ్ళు ఆశించడం వలన పంట దిగుబడుల పై ప్రభావం చూపుతాయి. సరైన సమయంలో యాజమాన్య పద్దతులు రైతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. 

గత సంవత్సరం శనగ లో మనము మొట్ట మొదటిసారిగా గాలి ద్వారా ఆకులను ఆశించు తెగుళ్ళ ఉధృతి గమనించడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా శనగ పంటను గాలి ద్వారా ఆకులను ఆశించు తెగుళ్ళ ఉధృతి పెరిగే అవకాశం ఉంది కావున వాటి యాజమాన్య పద్దతుల గురించి వివరిస్తున్నాము.

బూజు తెగులు (Powdery mildew):

ఈ తెగులు బొట్రైటీస్ సినెరియా అనే శిలీంద్రం వలన సంక్రమిస్తుంది. శనగ పైరు పూత దశలో వున్నప్పుడు ఆ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పూత పిందే దశలలో ఉష్ణోగ్రత 20 - 25 డిగ్రీల సెంటిగ్రేట్ మరియు గాలిలో తేమ అధికంగా ఉంటే ఈ తెలుగు ఉధృతి అధికంగా ఉంటుంది. 

బూజు తెగులు

తెగులు లక్షణాలు (pests symptoms) :

తెగులు ఆశించిన మొక్కలలో కాయలు ఏర్పడవు. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్నపుడు కాండము, ఆకులు, పూలు, కాయల పై ముదురు గోధుమ మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన లేత కొమ్మలు కుళ్ళి విరిగిపోతాయి. కాయలపై నిర్దిష్టమైన ఆకారంలోని నీటి మచ్చలు ఏర్పడతాయి.

తెగులు నివారణ ( pest prevention) : 

నీటి పారుదల ప్రాంతాలలో ఆలస్యంగా విత్తడం, తక్కువ విత్తన మోతాదు మరియు మొక్కల వరుసల మధ్య సిఫారసు మేరకు దూరం పాటించడం ద్వారా శనగ పేరుని బూజు తెగుల ఉధృతి నుంచి తప్పించవచ్చు. ఈ తెగులు నివారణ కి థయోబెండజోల్ 200గ్రా. చొప్పున ఎకరానికి పిచికారి చేసుకోవాలి.

ఆకుమాడు తెగులు (pests):  

ఈ తెగులు కొలిట్రోట్రైకామ్ డిమాంటియం అనే శీలింద్రం వలన సంక్రమిస్తుంది. ఈ తెగులు పంట కాలంలో ఎప్పుడైనా ఆశించవచ్చు. ఈ తెగులు విత్తనం మరియు నెల ద్వారా వ్యాప్తి చెందును. ఈ తెగులు ముందస్తుగా విత్తిన పొలాల్లో కనిపిస్తుంది. అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి సోకె అవకాశము ఉంది.
ఆకుమాడు తెగులు

తెగులు లక్షణాలు :

ఈ తెగులు(pests) ఆశించిన పొలంలో అక్కడక్కడ పూర్తిగా ఎండిపోయిన మొక్కలు మరియు పాక్షికంగా ఎండిపోయిన కొమ్మలు కనిపించును. కొమ్మల పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడును. తెగులు pests సోకిన కొమ్మలు కోన భాగము నుండి క్రింది వరకు ఎండిపోవును. ఆకులు మరియు కాయలపై ఈ వ్యాధి ఆశించినప్పుడు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొనభాగం నుండి క్రింది వరకు ఎండిపోవును.

తెగులు నివారణ :

ఈ తెగులు pests నివారణకు మొక్కల వరుసలు మధ్య సిఫారసు మేరకు దూరం పాటించాలి. హెక్సాకొనజోల్ 400 మి. లీ లేదా ప్రోపికొనజోల్ 200 మి. లీ. లేదా క్లోరోథయోనిల్  400 గ్రా. చొప్పున ఎకరానికి పిచికారి చేసుకోవాలి.

తుప్పు తెగులు (Pests) :

ఈ తెగులు యూరోమైసిస్ సైసేరి అరైటిని అనే శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఈ తెగులు ఆశిస్తుంది. చల్లని, తడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.

తెగులు లక్షణాలు :

ఆకులపై గుండ్రని చిన్న గోధుమ రంగు పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. తెగులు pests 
తుప్పు తెగులు

తీవ్రమైనపుడు ఈ పొక్కులు ఆకుల పై భాగాల్లో కూడా వ్యాపిస్తుంది మరియు మొక్కలు పక్వానికి రాకముందే ఎండిపోతాయి.

తెగులు నివారణ :

ఈ తెగులు Pests నివారణకు ఎకరానికి హెక్సా కొనజోల్ 400 మి. లీ. లేదా ప్రోపికొనజోల్ 200 మి. లీ. లేదా ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ (నేటివో) 160 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటికి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచ్చికారి చేసుకోవాలి.


 

No comments