రాగి సాగులో మెలుకువలు మరియు తెగుళ్ళు నివారణ | Techniques and Pest Prevention in Copper Cultivation | raithubadi
రాగి లో రకాలు:
శ్రీ చైతన్య, వకుళ, సువర్ణణముఖి, తిరుమల, వేగావతి, ఇంద్రావతి, గౌతమి మరియు హిమ (తెల్ల రాగి) రకాల కాల పరిమితి 100 - 115, మారుతి, చంపావతి 80 - 90 రోజుల కాల పరిమితి కలిగిన రకాలు, అగ్గితెగులును తట్టుకుంటాయి. అన్ని ప్రాంతాలకు అనుకూలం, గింజ దిగుబడి 12 - 15 క్వింటాళ్లు.
విత్తు సమయం: రబీలో అక్టోబర్ మరియు నవంబర్ మాసంలో, వేసవిలో, జనవరి మాసంలో విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు: 2.5 కిలోల విత్తనం తో 5 సెంట్లలో (200 చ.మీ) పెంచిన నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్దతిలో అయితే ఎకరాకు 4 కిలోల విత్తనం కావాలి.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 2 గ్రాముల కార్భండిజిమ్ లేదా 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తనశుద్ది చేసిన చో పంట తొలిదశలో చీడపీడలు రాకుండా నివారించవచ్చు.
నారు మడిని తయారు చేయడం : 5 సెంట్ల నారు మడి ఎకరాకు సరిపోయే నారును ఇస్తుంది. నారు మడిలో తగినంత పశువుల ఎరువును, 2 కిలోల సూపర్ ఫాస్ఫాటే నేలలో చల్లుకొని మెత్తగా దున్ని నారు పోసుకోవాలి. నారుమడిలో పలుచగా విత్తనాలు చల్లి మట్టిలో కలిసేలా కలపాలి. విత్తిన తర్వాత పలుచగా నీటి తాదులివ్వాలి.
ఎరువులు : ఎకరా పొలంకు 2 - 4 టన్నుల పశువుల ఎరువులను మరియు 16 కిలోల భాస్వరం, 12 కిలోల పోటాష్ ఇచ్చు ఎరువులను ఆఖరి దుక్కిలో బాగా కలియాడున్నాలి. నాట్లు వేసే ముందు ఎకరానికి 12 కిలోల నత్రజనిని ఇచ్చు ఎరువులను వేయాలి. నాటిన 25 రోజుల తరువాత (కలుపు తీసిన తరువాత) మళ్లీ ఎకరానికి 12 కిలోల నత్రజనిని వేసుకోవాలి.
నాట్లు వేయడం : స్వల్ప కాలిక రకాలకు (85 - 90 రోజులు) 21 రోజుల వయస్సు కల్గిన నారును వరుసల మధ్య 15 సెం. మీ దూరంగా ఉండేలా నాటుకోవాలి. మధ్యకాలిక రకాలకు (105 - 120) 25 రోజుల వయస్సు కల్గిన నారును వరుసల మధ్య 20 సెం. మీ వరుసలో 10 సెం. మీ దూరంగా ఉండేలా నాటుకోవాలి.
విత్తడం: వెదజల్లే పద్దతిలో బాగా దుక్కి చేసిన పొలంలో విత్తనాన్ని పలుచగా మరియు సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తరువాత బల్లతో నేలను చదును చేయాలి.
కలుపు నివారణ మరియు అంతర కృషి: విత్తనం వెదజల్లే పద్దతిలో విత్తిన రెండు వారాలలోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. నారు నాటిన తరువాత పెండిమిథాలిన్ 30% కలుపు మందును ఎకరాకు 600 మి. లీ మందును 200 లీ నీటిలో కలిపి (3 మి. లీ /లీటరు నీటికి) పిచికారి చేసి కలుపును నివారించవచ్చు Prevention. నాటిన 25 - 30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్ములనకు ఎకరాకు 400 గ్రాముల 2 - 4 డి సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీ నీటిలో (2 గ్రా / లీటరు) కలుపు మొక్కలపై పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం: పంటలో సున్నిత దశలైన పిలకల దశ, చిరుపొట్ట దశ, పూత దశ మరియు గింజ గట్టిపడి దశలలో నీరును పెట్టాలి.
చీడపీడలు:
అగ్గి తెగులు:
నారు మడిలో తెగులు సోకినప్పుడు లేత మొక్కలు మాడిపోతాయి. ఎదిగిన మొక్కల ఆకుల పై దారపు కండె ఆకారంలో మచ్చలు చుట్టూ ఎరుపు గోధుమ రంగు అంచులు ఉండి మధ్యలో బూడిద రంగు కల్గి ఉండును. కనుపుల మీద కూడా ఈ వ్యాధి నలుపు రంగు మచ్చల రూపంలో కనిపిస్తుంది. మెడ విరుపుగా ఆశించినప్పుడు కణుపు దగ్గర మొక్క విరిగిపోతుంది.
వెన్నుపై ఆశించినప్పుడు ధాన్యపు గింజలు తాలు గింజలుగా మారుతాయి. అధిక నత్రజని వాడినప్పుడు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు Prevention తెగులును తట్టుకొను రకాలను సాగు చేయాలి. 3 గ్రాముల థైరామ్ లేక కాప్టాన్ ను కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేయాలి. మొక్కల పై మచ్చలు కనిపించిన వెంటనే కార్బముడిజిమ్ మందును లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పైరు పై పిచికారి చేయాలి.
పేనుబంక:
పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే కంకులు రాకపోవడం మరియు గింజలు రాకపోవడం గమనించవచ్చు. దీని నివారణకు Prevention డైమిథోయెట్ 2 మి. లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
Post a Comment