Header Ads

What is Learning Farmers in YSR Polambadi | డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి వలన రైతన్నలు ఏమి నేర్చుకుంటారు? | raithubadi


డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి వలన రైతన్నలు ఏమి నేర్చుకుంటారు?


https://raithubadi.blogspot.com



What is Learning Farmers in YSR Polambadi
రైతులు తమ నిర్ణయాత్మక శక్తిని పెంచడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటను పండించడం. 

ప్రకృతికి వ్యవసాయానికి ఉన్న అవినాభావ సంబంధం గుర్తించటం ప్రతీ వారం పరిశీలించి విశ్లేషించుట వలన పేరులో ఏరకమైన సేద్య పద్దతులు, ప్రత్యేకంగా ఆ వారంలో అవలంబించవలసినవి నిర్ణయించుట.

ఉదా౹౹ పైరుకు నీరు పెట్టాలా లేదా కలుపు తీయాలా, శత్రు మరియు మిత్ర కీటకాల ఉనికి, తెగుళ్లు పై వాతావరణ ప్రభావం, సేద్యపద్దతులు మరియు ఇతర పద్ధతుల ద్వారా తెగుళ్లను కీటకాలను అదుపు చేయటం మొదలగునవి నేర్చుకుంటారు.

బోధనా పద్దతి:

What is Learning Farmers in YSR Polambadi
ఈ శిక్షణా కార్యక్రమంలో రైతులను భాగస్వాములుగా చేయడం (Participatory Learning). అనుభవపూర్వకంగా నేర్చుకొనడం. రైతుల అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకోవడం జరుగుతుంది (Sharing Experiences). అంతేగాక ముఖ్యంగా పొలంలో పర్యావరణ విశ్లేషణ అంటే ప్రతీవారం పొలాల్లోకి వెళ్లి మొక్కల ఆరోగ్యం, వాతావరణం, భూమిలోని తేమ, కలుపు మొక్కలు సాంద్రత, భూమిలోని పోషక పదార్థాల యాజమాన్యం, తెగుళ్ళు, కీటకాలు వాటి యొక్క హాని లక్షణాలు, మిత్ర కీటకాల  ఉనికి  వాటి సంఖ్య చార్ట్ పేపరు లేదా డ్రాయింగ్ పేపరు పై వ్రాసి సోదాహరణంగా చర్చించుకుని అవసరమైన సూచనలు మరియు తుది నిర్ణయాలు నిర్ధారించుకొనుట జరుగుతుంది.

https://raithubadi.blogspot.com


సదుపాయ కర్త (Farmer's Facilitator) శిబిరం నిర్వహణలో, ఒక అధ్యాపకుడుగా గాక తాను ఒక మిత్రునిగా ప్రశ్నలు వేస్తూ రైతులచే జవాబులు రాబట్టాలి. ఈ కారణం వల్ల ఆ సమాధానాలు అనుభవపూర్వకమై ఉండి, రైతులు చేసే వ్యవసాయ పద్దతులలో లోటు పాట్లు తెలుసుకొని చేయవలసిన మార్పులు చేర్పులు నిర్ధారించుకొంటారు. బృంద విన్యాసము (Group Dynamics) వలన జట్టులో ఐక్యమత్యం, స్ఫూర్తి, నాయకత్వం గా వనరుల వినియోగానికి మరియు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి.

నేర్చుకునే లక్ష్యాలు (Learning Aims):

పొలంబడి శిక్షణ పూర్తయ్యేలోపు రైతులు ఈ క్రింది పనులన్నీ చేయగలగాలి.
  1. పంట వృద్ధి చెందే తీరును వర్ణించడం.
  2. పంట పై వివిధ చీడపీడల యాజమాన్యం వంటి ఉదాహరణలతో వర్ణించడం. నష్టాన్ని పైరు ఎలా ఎదుర్కొని / అధిగమించి మామూలు ఫలసాయం ఎలా అందించింది వంటివి ఉదాహరణలతో వర్ణించడం.
  3. పొలంలో చూసిన పంటలకు నష్టం కలిగించే పురుగులు మరియు వాటి సహజ శత్రువుల యొక్క జీవిత చక్రం మరియు జీవావరణ చర్యలను గుర్తించడం.
  4. వివిధ రోగాల (తెగుళ్ళు) ను ఆయా ప్రాంతాలలో పిలిచే పేర్లు, అవి పంటకు కలిగించే నష్టం, అవి వృద్ధి చెందుతున్న తీరు గుర్తించడం - పంట పై ఉన్న రోగాల నష్టం తీరును ప్రత్యక్షంగా చూసి అంచనావేయడం.
  5. ఎలుకలు చేసే నష్టాన్ని మరియు ఎలుకల సరియైన నివాసాంశాలను గుర్తించడం.
  6. సాధారణంగా వాడే పురుగు మందుల (కలుపు మందులు, శిలీంద్రనాశీనులు, కీటక నాశీనులు, ఎలుకల మందు) యొక్క విషతుల్యత మరియు విష బారికి గురికాకుండా అవలంభించాల్సిన మార్గాలు వర్ణించడం.
  7. పురుగుమందులు (కలుపు మందులు, శిలీంద్రనాశీనులు, కీటక నాశీనులు, ఎలుకల మందులు) లక్ష్య-శత్రు పురుగుల పై మరియు మిత్రపురుగుల పై గురిలో లేని ఇతర జీవులపై, పర్యావరణం పై, రైతుల ఆర్యోగ్యం పై చివరికి వినియోగదారుని పై చూపే ప్రభావాన్ని వర్ణించగలగడం.
  8. ఒక పంట పై చీడ పీడలు ప్రత్యేక క్షేత్ర స్థితిలో కలుగజేయగల నష్టాన్ని, పురుగు మందులు చల్లడం వలన అయ్యే ఖర్చుతో పోల్చి, నిర్ణయం తీసుకొనే విషయాన్ని వర్ణించకలగడం.
  9. ఒక పంట స్థితిగతుల ననుసరించి చీడ పీడలు వృద్ధిచెందగలిగే శక్తిని (మొక్క పెరుగుదల మరియు దశ, వాతావరణ విధములు, మొక్క యొక్క నిరోధక స్థితి, నీటి మట్టాలు, చీడ పీడలు, సహజ శత్రువులు మొదలైనవి) మరియు పంటను కాపాడగలిగే యాజమాన్య చర్యల ఖర్చును (నీటి పారుదల, ఎరువులు వేయడం, చీడ పీడల నియంత్రణ పద్దతులు) పోల్చి దిగుబడులు పెంచడానికి మరియు దిగుబడి నష్టాన్ని తగ్గించడానికి ఆ చర్యల ప్రభావాన్ని అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవడం.
What is Learning Farmers in YSR Polambadi | raithubadi

No comments