AP Government Paddy Procurement Centers Details in telugu | ప్రభుత్వ కనీస మద్దతు ధరకు ధాన్యము కొనుగోలు కేంద్రాలు 2019-2020 నిర్వహణ – నియమావళి | Raithubadi
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయుటకు సూచనలు
గత సీజన్లలో మాదిరిగా కాకుండా రబీ 2019-20 సీజను నుండి “మధ్యవర్తులను” సమూలంగా తొలగిస్తూ e-కర్షక్ లో నమోదు అయిన రైతులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యమును కొనుగోలు చేయుటకు జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టుట జరిగినది.
దళారీల ప్రమేయం లేకుండా రైతులు తాము పండించిన ధాన్యమును నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, ప్రభుత్వం వారు ప్రకటించిన మద్దతు ధరను పూర్తిగా పొందవచ్చును.
ధాన్యం కొనుగోలు కేంద్రములు, మద్దతు ధర, వగైరా వివరముల కొరకు జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయములో ఏర్పాటు చేయబడిన కంట్రోలు రూమ్ నెంబరు 0861-2306651నకు ఉదయం గం:8.00 నుండి రాత్రి గం: 8.00ల లోపు ఫోను చేసి, సమాచారమును పొందవచ్చును.
తేమ తనీఖీ నివేదిక
మండలము: కొనుగోలు కేంద్రము పేరు:
(కొనుగోలు ఏజెన్సీ)
గ్రామము :
రైతు పేరు :
తండ్రి పేరు :
ఆధార్ నెంబరు :
భూమి విస్తీర్ణము (య .సెం.లలో) :
దిగుబడి అంచనా (40/75 కేజీల బస్తాలలో :
తేమ పరిశీలించిన తేది మరియు సమయము :
తేమ శాతము :
రిమార్కు/సూచనలు :
కార్యాలయ స్టాంపు
తేమ పరీక్ష నిర్వహించిన అధికారి సంతకము:
పేరు మరియు హోదా:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి సాగు ప్రధానంగా తెలుగు గంగ కాలువలు, చెరువులు మరియు సోమశిల జలాశయము, బోర్లు ద్వారా లక్షల ఎకరాలలో జరుగుతుంది. పై సాగు నీటి వనరులతో వరి ప్రధాన పంటగా సేద్యం చేయబడుతుంది
2019-20 రబీ కొనుగోలు కేంద్రాలు
ప్రభుత్వం సాధారణ వారి రకానికి రూ.1815/- క్వింటాలుకు, గ్రేడ్ ఏ రకానికి రూ. 1835/- క్వింటాలుకు కనీస మద్దతు ధర నేరుగా కల్పించే ఉద్దేశంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2019-20 రబీ సీజనులో ధాన్యం కొనుగోలు కేంద్రముల ద్వారా ధాన్యం కొనుగోలుకు భారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించబడినది.
.వరి రకం సాధారణం 75 కేజీలకు – రూ. 1361.25, క్వింటాలుకు రూ.1815/- పుట్టికి రూ.15427/-
.గ్రేడ్ ఏ రకం 75 కేజీలకు రూ.1376.25, క్వింటాలుకు రూ.1835 పుట్టికి రూ.15597/-
రబీ దిగుబడికి అనుకూలంగా వివిధ సంస్థల ద్వారా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయడానికి చర్యలు తీసుకోవడమైనది.
i) వెలుగు గ్రామ సంఘములు
ii) సహకార పరపతి సంఘములు (PACS)
iii) DCMS ద్వారా ఏర్పాటు చేయబడినవి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయములు):
జిల్లాలో 2019-20 రబీ సీజనుకు సంవత్సరానికి 65 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైనది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్.
i) టార్పాలిన్సు
ii) తేమ చూసే యంత్రాలు
iii) కాటా (ధాన్యం తూకమునకు)
iv) చిన్న కాటా (ధాన్యం విశ్లేషణ కొరకు)
v) సీవ్స్
vi) పొట్టు తీసే డీ హస్కు పరికరము
vii) కలర్స్, బ్రష్, ప్యాడి క్లీనర్స్, విన్నోయింగ్ మెషిన్
నాణ్యతా ప్రమాణములు :
మట్టి, రాళ్ళు, ఇసుక :1.0%
గడ్డి, చెత్త, తాలు, పొట్టు :1.0%
దెబ్బతిన్న, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం :5.0% పరిపక్వంగాని, కుంచించుకుపోయిన, మెలితిరిగిన ధాన్యం :3.0%
తక్కువ శ్రేణి గింజలు లేక కేళీలు (గ్రేడ్ ఏ రకములో :6.0%
తేమ శాతం :17.0%
గోనె సంచులు
2019-20 సంవత్సరమునకు సివిల్ సప్ప్లయిస్ కార్పొరేషన్ నందు ఈ క్రింది విధంగా గోతాలు సిద్దంగా వున్నవి
రైతులకు అవసరమగు గోతాలు రైస్ మిల్లర్లు ప్యాడీ ఫిల్లింగ్ నిమిత్తం అందచేయవలెను.
.జిల్లా మేనేజర్, సివిల్ సప్ప్లయిస్ మరియు డి.ఎస్.వో వారు ప్రతీ రోజూ సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రం వారీగా పి.డి. డి.ఆర్.డి ఏ., జిల్లా సహకార శాఖ మరియు జే.డి. అగ్రికల్చర్, తహసిల్దారు వారినుండి సమాచారం పొందిన వెంటనే అవసరమైన గోనెసంచులు సి.ఎం.ఆర్. ప్యాకింగ్ నిమిత్తం ఆయా రైసు మిల్లులకు వెళ్ళే ఏర్పాటు చేయాలి.
.సహాయ మేనేజర్ (జనరల్) సివిల్ సప్ప్లయిస్ వారు సంబంధిత రైసు మిల్లులకు అవసరమైన సంచులు వెళ్ళే విధి విధానములు చూసుకొనవలెను.
కాల్ సెంటర్
జిల్లా కేంద్రంలో 12 గంటలు అనగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నడిచే కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. కొనుగోలు ప్రారంభం నుండి ధాన్యం కొనుగోలు పూర్తిగా అయ్యేవరకు కాల్ సెంటర్ కొనసాగాలి.
కాల్ సెంటర్ లో సహకార శాఖ, రెవిన్యూ శాఖ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నుండి ఉద్యోగులను 2 shifts ల లో పనిచేసేలా నియామకం చేయాలి.
కాల్ సెంటర్ ల లో ఫోన్స్ రిసీవ్ చేసుకోవడం వాటిని వెంటనే కంప్యూటర్ లో డేటా ఎంటర్ చేయడం జరగాలి. ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను, ఒక కంప్యూటర్ మరియు ప్రింటరును ఏర్పాటు చేయాలి.
కాల్ సెంటర్ ద్వారా ఆశించే వనరులు
i) ఏ ఏ కేంద్రములలో ఏ రోజు ఎంత ధాన్యం సేకరణ జరిగింది.
ii) గోదాముల స్థితి, రవాణా ఏర్పాట్లు
iii) రైతుల నుండి వచ్చిన శాoపిల్స్ వినరములు
iv) రైతులకు డబ్బు పంపిణీ వివరములు (RTGS ద్వారా)
v) కేంద్రం వారీ సమస్యలు
vi) ప్రతిరోజు కాల్ సెంటర్స్ వచ్చిన వివరములను జిల్లా స్థాయిలో సరిచుచుకొని సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేయాలి.
రవాణా వివరములు:
కొనుగోలు కేంద్రములు పని ప్రారంభించేసరికి ధాన్యం మరియు CMR రవాణాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ రాష్ట్ర స్థాయిలో జరుగుచున్నది.
ప్రతిరోజు ఎన్ని మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రములకు వస్తుదనే అంచనా వేసుకోవాలి.
రవాణాదారు పై అంచనా ప్రకారం కొనుగోలు కేంద్రముల నుండి రవాణా చేసేందుకు అవసరమైన ట్రక్కులు ఏర్పాటు చేసుకోవాలి. మరియు వాటికి GPS ట్రాకింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
రవాణాకు సంబంధించి రెవిన్యూ డివిజన్ అధికారుల వారీగా డివిజన్ పాయింట్స్ పెట్టుకోవాలి.
గ్రామాల్లో ట్రాక్టర్ల లభ్యతను తహసిల్దార్ / రెవిన్యూ డివిజన్ అధికారి సిద్దము చేసుకొని ఉండవలెను.
కొనుగోలు కేంద్రం లోని అధికారి ప్రతి ట్రక్కు యొక్క నెంబర్ కనపడేవిధంగా ఫోటో తీసి భద్రపరచావలెను
ధాన్యం కొనుగోలు కేంద్రములోని సభ్యుల బాధ్యతలు
మొదటి సభ్యుడు: మీరు కేంద్రమునకు పూర్తి బాధ్యులుగా ఉందురు. ధాన్యం కొనుగోలు మరియు మిల్లులకు ధాన్యం రవాణా రిజిష్టర్లు నిర్వహించవలెను. రోజువారీ కొనుగోళ్లు సమాచారం పై అధికారులకు తెలియపరచావలెను. ధాన్యం రైతు కళ్ళం నుండి లేదా పి.పి.సి నుండి రైస్ మిల్లులకు రవాణా చేసినది ఎవరనేది కచ్చితంగా నిర్ధరించవలెను. మరియు సదరు ట్రక్ షీటు పై నిర్ధారణ ధృవపత్రం వ్రాసి సంతకం చేయవలెను.
రెండవ సభ్యులు: వచ్చిన శాంపిల్ విశ్లేషణ చేసి రిజిష్టర్ లో నమోదు చేయవలెను. రైతు వారీగా ధాన్యం కొనుగోలు వోచర్లు తయారు చేయవలెను. ధాన్యం మిల్లులకు వరణ చేయనపుడు ట్రక్ షీటు జనరేట్ చేసి పంపవలెను.
మూడవ సభ్యులు: రైతు తెచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలను పరీక్షిoచవలెను. రైతు రాశిలో నుంచి అన్ని పక్కల ధాన్యం సేకరించి 1 కె.జి. కేంద్రమునకు మచ్చుగా విశ్లేషణ కొరకు తీసుకురవలెను. ధాన్యములో తేమ శాతం 17 లోపు వచ్చేలా వి.ఆర్.ఓ. లు రైతులకు అవగహన కల్పంచాలి. లేనిపక్షంలో తేమ ఎక్కువ ఉన్న ధాన్యం కేంద్రానికి వచ్చిన యెడల అందులకు కేంద్రం వద్ద స్థలం లేకపోతే రైతు ఇబ్బందిపడే అవకాసం కలదు.
నాల్గవ సభ్యులు: రైతులు నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూకం వేయుట మరియు మిల్లులకు ధాన్యం రవాణా చేయునపుడు బస్తాలు లెక్కించి రిజిష్టరు లో నమోదు చేయుట.
ఐదవ సభ్యులు: రైతు క్రమసంఖ్యను కొనుగోలు చేసిన అన్ని బస్తాలపై వ్రాసిన ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు రవాణా చేయుట లేదా గ్రేడ్-ఎ ధాన్యము, సాధారణ ధాన్యము విడి విడి గా నెట్టు కట్టించుట.
ఆరవ సభ్యులు: రైతులు రవాణా వాహనాల రిజిస్ట్రేషన్, ధాన్యం కొనుగోలు మరియు మిల్లులకు రవాణా ప్రక్రియ NFSA వెబ్ సైట్ నందు ఎప్పటికప్పుడు జరిపించుట (టెక్నికల్ పర్సన్)
కొనుగోలు చేసిన ధాన్యం నాణ్యతా ప్రమాణాల్లో లోపం వున్నా యెడల సంబంధిత కేంద్రం సెంటర్ టీం బాధ్యత వహించాలి.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం ఏ ఏ గ్రామాల నుండి వచ్చేది కేంద్రాల వారీగా జాబితా కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ముందే తాయారు చేసుకోవాలి.
కేంద్రంలో పాటించవలసిన సూత్రాలు
జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ వారు ఇచ్చిన ఈ క్రింది రిజిస్టర్లు విధిగా కొనుగోలు కేంద్రం ఇంచార్జే నిర్వహించాలి.
1. ధాన్యం గిడ్డంగులకు రవాణా వివరముల రిజిస్టర్
2. ధాన్యం స్టాక్ రిజిస్టర్3. ధాన్యం సాగు ధృవీకరణ పత్రం
4. సందర్శకుల స్టాక్ రిజిస్టర్
5. అనుమతి పత్రం
6. తుది విశ్లేషణ పత్రం.
కేంద్రంలో సెంటర్ ఇంచార్జీ ఇతర సిబ్బంది ఎట్టి పరిస్తుతుల్లో ఎఫ్.ఏ.క్యూ. నాణ్యతా ప్రమాణాల (norms) లేని ధాన్యం తీసుకొనరాదు.
ప్రతి రోజూ సాయంత్రం కాల్ సెంటర్ కు యేని టన్నుల ధాన్యం సేకరించిందీ ఫోన్ ద్వారా సంబంధిత శాఖ అధికారి గారికి తెలియపరచాలి.
రైతు తన ధాన్యమును రాశిగా పోసిన తరువాత నాణ్యతా ప్రమాణాలు సరిచుసిన తరువాత ధాన్యం కేంద్ర వద్దే కాటా పట్టాలి.
2017-18 రబీ సీజను నుండి మార్చబడిన విధానముల ప్రకారం కనుగోలు చేయబడిన ధన్యమునకు రావలసిన సి.ఎం.ఆర్. లెక్కించి, తదనుగుణంగా ఖాళీ గోనే సంచులను సంబంధిత రైసు మిల్లులకు నేరుగా పంపబడును.
గోదాములు:
ప్రతి రోజూ వచ్చే ధాన్యం దిగుమతులు అంచనా బట్టి గోదాములు ఏర్పాటు కేంద్రం వారీగా పరిశీలన చేసుకోవాలి.
ఖాళీ స్థలంలో స్టాక్ చేసినట్లయితే వర్షానికి ఇబ్బంది లేకుండా టార్పాలిన్స్ వేయాలి.
తొలుత గోదాముల గుర్తింపు పూర్తి చేయాలి. దానికి అనుగుణంగా కేంద్రాలు ప్రారంబించాలి.
గోదాముల్లో స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలి.
గోదాములు వున్నా చోట్ల చేద, ఎలుకలు, వర్షం, దొంగతనాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
గోదాములు లేదా ఖాళీ స్థలంలో storage కి నైట్ వాచ్ మెన్ ను కాపలాగా నిర్వహణ ఏజెన్సీ వారు ఏర్పాటు చేసుకోవాలి.
Post a Comment